Dhurandhar 2 Movie Controversy: ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్న సినిమా ‘దురంధర్ 2’… ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో ప్రేక్షకులైతే ఉన్నారు. ఇక మేకర్స్ సైతం అదే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తుండటం విశేషం… ఇప్పటికి ప్రతి షో హౌస్ ఫుల్ అవుతుంది అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ అయి ఆల్రెడీ 10 రోజులు అవుతున్నప్పటికి ఈ సినిమాను ఢీకొట్టే సినిమా మరొకటి రాకపోవడంతో ఈ మూవీ తన సత్తా చూపిస్తుంది… దురంధర్ 2 సినిమా రిలీజ్ కి ముందు తెలుగు వాళ్ళు ఈ సినిమాని చాలా తక్కువగా అంచనా వేశారు.
కానీ ఈ సినిమా రిలీజై నెక్స్ట్ లెవెల్లో ఉండడమే కాకుండా మన స్టార్ హీరోలు దర్శకులందరు సినిమాను చూసి బాగుందంటూ ట్వీట్లు వేయడంతో చాలామంది ఈ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగెటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ తనకు అనుకూలంగా ఈ సినిమాను చేయించుకుంది అంటూ కామెంట్లను చేస్తున్నారు. టెర్రరిజం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య…
దాని మీద పోరాడటానికి మన ఇండియా నుంచి వెళ్ళిన ఒక రా ఏజెంట్ ఎలా వర్క్ చేశాడు. అక్కడి వాళ్లను ఎలా పట్టుకొని చంపేశాడు అనేది ఈ సినిమా స్టోరీ… ఇక ఇలాంటి సందర్భంలో దేశభక్తి ని కథతో వచ్చిన సినిమాని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. గానీ అలా డిస్క్రైబ్ చేయకూడదు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా మీద చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మన దేశంలో ఉన్న సినిమా ప్రేమికుల నుంచి అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా ఈ మూవీకి విపరీతమైన ప్రశంసలు అందుతున్నాయి. మన దేశం కోసం ఒక దర్శకుడు బాధ్యతతో సినిమా చేసినప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ప్రేక్షకుడి మీద ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేస్తే బాగుంటుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…