dulquer salmaan: గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో దుల్కర్​ సల్మాన్​!

dulquer salmaan: మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా కేబీఆర్​ పార్క్​లో మొక్కలు నాటారు. సినీ నటి అదితిరావు హైదరి విసిరిన ఛాలెంజ్​లో భాగంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నారు దుల్కర్​. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్​ కుమార్​ ఈ గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దుల్కర్​ సల్మాన్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్​కుమార్​ చేపట్టిన ఈ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ […]

Written By: Sekhar Katiki, Updated On : November 11, 2021 2:12 pm
Follow us on

dulquer salmaan: మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా కేబీఆర్​ పార్క్​లో మొక్కలు నాటారు. సినీ నటి అదితిరావు హైదరి విసిరిన ఛాలెంజ్​లో భాగంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నారు దుల్కర్​. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్​ కుమార్​ ఈ గ్రీన్​ఇండియా ఛాలెంజ్​ను చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా దుల్కర్​ సల్మాన్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్​కుమార్​ చేపట్టిన ఈ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్​ స్వీకరించి మొక్కలు నాటాలని దుల్కర్​ పిలుపునిచ్చారు.  అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.. దుల్కర్ సల్మాన్​కు వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

కాగా, దుల్కర్ సల్మాన్​ హీరోగా నటిస్తున్న సినిమా కురుప్​. ఇటవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రైమ్​ థ్రిల్లర్​ నేపథ్యంలో రానున్న ఈ సినిమా.. నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళకు చెందిన ఒకప్పటి బడా క్రిమినల్​ సుకుమార కురుప్​ జివిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ క్రిమినల్​ను పట్టుకునేందుకు పోలీసులు  చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్​ వేసే ఎత్తులు ట్రైలర్ చూసినప్పుడు ఉత్కంఠంగా అనిపించింది. దీంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా కీలకంగా నిలిచింది.