Dulquer Salmaan: కేవలం హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ఆయన ఒక కథని నమ్మి సినిమా చేశాడంటే సూపర్ హిట్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు ట్రేడ్ పండితులు. తెలుగులో నాని కి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ లో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కి అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. సూపర్ స్టార్ మమ్మూటీ కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని మొదటి సినిమా నుండే ఏర్పాటు చేసుకోవాలనే తపనతో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన మన టాలీవుడ్ లో మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు చేసాడు.
Also Read: విమానం నుండి దూకేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్..వణుకుపుట్టిస్తున్న వీడియో!
ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ కి మన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలా మన తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, నిర్మాతగా నాని వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ మరెవరో కాదు, ఈ ఏడాది ‘కోర్ట్’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాసిన రామ్ జగదీశ్ డైరెక్టర్. రీసెంట్ గానే నాని ని కలిసి ఆయన ఒక స్టోరీ ని వినిపించాడట. నాని కి తెగ నచ్చేసింది. ఎవరితో ఈ సినిమా చేద్దాం అని అనుకుంటూ ఉండగా, దుల్కర్ సల్మాన్ పేరు ని నాని ప్రస్తావించాడట. డైరెక్టర్ కూడా ఓకే అనడంతో నాని వెంటనే దుల్కర్ సల్మాన్ కి ఫోన్ చేసి నా దగ్గర ఒక మంచి కథ ఉంది, డైరెక్టర్ ని నీ దగ్గరకు స్క్రిప్ట్ న్యారేషన్ కోసం పంపిస్తున్నాను అని అన్నాడట.
అందుకు దుల్కర్ సల్మాన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ స్క్రిప్ట్ ని దుల్కర్ సల్మాన్ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ కి కేవలం మలయాళం, తెలుగు లో మాత్రమే కాదు, తమిళం, హిందీ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఆయన ప్రత్యేకంగా సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇలాంటి అరుదైన రికార్డు గతంలో ధనుష్ కి మాత్రమే ఉండేది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ధనుష్ ని సైతం దాటిపోయాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘కాంతా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. రానా దగ్గుబాటి నిర్మాణం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. భాగ్యశ్రీ భోర్సే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచడం వెనక ఉన్న కారణం ఏంటంటే..?