Balakrishna: తమిళ హీరో అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదని టాక్ వచ్చింది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ముందు ఆయన హీరో విశాల్ తో చేసిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది. మంచి విషయం ఉన్న దర్శకుడు అని యూత్ ఆడియన్స్ నుండి మంచి పేరు తెచుకున్నాడు. ఇప్పుడు ఆయన మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. రీసెంట్ గానే అధిక్ రవిచంద్రన్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ని కలిసి ఒక కథ ని వినిపించాడట. ఇప్పటి వరకు బాలయ్య బాబు ముట్టుకొని జానర్, చేయని క్యారక్టర్ ని డిజైన్ చేసాడట.
Also Read: విమానం నుండి దూకేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్..వణుకుపుట్టిస్తున్న వీడియో!
అది బాలయ్య బాబు కి తెగ నచ్చినట్టు సమాచారం. నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇక నుండి కొత్త చాప్టర్ మామూలు రేంజ్ లో ఉండదు, ఎవ్వరూ ఊహించని ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ బాలయ్య బాబు ఇది వరకే ఒక సంచలన ప్రకటన చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని సెట్ చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ అజిత్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం తర్వాతే బాలయ్య తో సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక బాలయ్య బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను తో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్న బాలయ్య, ఈ చిత్రం పూర్తి అవ్వగానే జూన్ 10 న గోపీచంద్ మలినేని తో కొత్త సినిమాని మొదలు పెట్టబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే బాలయ్య మరో సినిమా వైపు చూసే అవకాశం ఉంటుంది. అఖండ చిత్రం నుండి వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ భీభత్సమైన ఫామ్ లో ఉన్న బాలయ్య, ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో తన జైత్ర యాత్రని కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నారు నెటిజెన్స్. చూడాలి మరి ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఇక అఖండ చిత్రం విషయానికి వస్తే, ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ కోసం జార్జియా కి వెళ్ళింది మూవీ టీం. అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపుగా పూర్తి అయ్యినట్టే. దసరా కి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు కానీ, గ్రాఫిక్స్ వర్క్ అప్పటికి పూర్తి అయ్యే అవకాశం లేకపోవడం తో సంక్రాంతికి వాయిదా వేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచడం వెనక ఉన్న కారణం ఏంటంటే..?