Lucky Bhaskar Movie Review: ‘లక్కీ భాస్కర్ ‘ ఫుల్ మూవీ రివ్యూ…

మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఈరోజు 'లక్కీ భాస్కర్' పేరుతో థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ కి ఒక మంచి విజయాన్ని అందించాడా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : October 31, 2024 10:06 am

Lucky Bhaskar Movie Review

Follow us on

Lucky Bhaskar Movie Review: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్… మమ్ముట్టి కొడుకు అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాల జోలికి వెళ్లకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ఇక తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక తను తెలుగులో ఇంతకుముందే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఈరోజు ‘లక్కీ భాస్కర్’ పేరుతో థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ కి ఒక మంచి విజయాన్ని అందించాడా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరిలకు ఒక కొడుకు ఉంటాడు. వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఒకానొక సమయంలో దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీని పోషించడానికి డబ్బే ముఖ్యం. అది లేకపోతే ఏదీ చేయలేము అనే ఒక ఆలోచనతో ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ అయినా చేయాలని జూదంలోకి దిగుతాడు.

అందులో ఆయన చాలావరకు డబ్బులను సంపాదిస్తాడు. మరి డబ్బు సంపాదించిన తర్వాత దుల్కర్ సల్మాన్ బిహేవియర్ ఎలా మారింది. డబ్బు ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తన ఫ్యామిలీని ఎలా లీడ్ చేశాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే వెంకీ అట్లూరి ఈ సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి సినిమా స్టోరీని రాసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి క్యారెక్టర్ కి ఆయన రాసుకున్న వరల్డ్ బిల్లింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. నిజానికి ఆయన గత సినిమా అయిన ‘సార్ ‘ సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ధనుష్ వల్ల ఆ సినిమా ఎక్కువ మందికి రీచ్ అయింది. ఇక అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా స్ట్రగుల్ అవుతుంది. డబ్బు అనేది వాళ్ళ జీవితాన్ని ఎలా శాసిస్తుంది అనే చిన్న ఒక ఎమోషన్స్ తో ఈ కథని బాగా రాసుకున్నాడు. అసలు ఎక్కడ డివియేట్ అవ్వకుండా ఎక్కడ అనవసరపు సీన్లకు వెళ్లకుండా కథకు ఏం కావాలో అలాంటి సీన్లను మాత్రమే పొందుపరుచుకొని ముందుకు సాగారు. వెంకీ అట్లూరి రాసుకున్న క్యారెక్టరైజేషన్ కూడా ప్రతి సీన్ కి జెస్టిఫికేషన్ ఇస్తూ వచ్చాడు. నిజానికి వెంకీ అట్లూరి సినిమాల్లో యాక్టర్స్ చేత యాక్టింగ్ చేయించుకోవడం గాని, ఆయన సీన్ కి రాసుకుని ట్రీట్మెంట్ గాని అంత బాగా ఎలివేట్ అవ్వవు. కానీ ఈ సినిమాలో యూనిక్ పాయింట్ ను కథగా తీసుకోవడం వల్ల ఆ మేజర్ క్యారెక్టర్ తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం.

కాబట్టి స్క్రీన్ మీద ఆయన చెప్పే డైలాగులు గాని ఆయన చేసే ఆక్టివిటీ గాని ప్రతి ఒక్క ఆడియన్ ని కట్టిపడేస్తుంది. అందుకే ఈ సినిమా చాలా బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని ఎందుకు రాసుకున్నాడు అనేది క్లారిటీగా చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆమెకు ఒక ప్లాట్ పాయింట్ అనేది లేకుండా ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కి ఒక మోటివ్ పాయింట్ లేకుండా రాసుకున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి ఒక మంచి విజయాన్ని సాధించాడనే చెప్పాలి. ఇక ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంది. ఇక హీరో డబ్బు సంపాదించే ఎపిసోడ్స్ ఎలివేషన్స్ తో కూడుకున్నవిగా చిత్రీకరించారు.

ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాత హీరో చేసిన ప్రతి పని సక్సెస్ అవుతూ ఉండడం వల్ల ప్రేక్షకులలో కొంతవరకు ఓకే అనిపించినప్పటికి హీరో క్యారెక్టరైజేశన్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటే బాగుండేది. ఎంతసేపు ఆయన అనుకున్నదే జరుగుతూ ఉండటం వలన ప్రేక్షకుడికి ఒకే అనిపించినప్పటికి ఆ ప్యూర్ ఎమోషన్ అయితే రాలేక పోతుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికొస్తే దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. తన గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఎక్కడా కూడా ఆయన డివియేట్ అవ్వకుండా క్యారెక్టర్ లో ఎంత పెర్ఫామెన్స్ అయితే కావాలో అంత పెర్ఫామెన్స్ మాత్రమే ఇచ్చాడు. అంతకుమించి ఆయన అతి ఎక్కడ చేయలేదు. అందుకే చాలా మంది దుల్కర్ సల్మాన్ అభిమానులుగా మారుతుంటారు.

ఆయన ఏ క్యారెక్టర్ లో చేసిన కూడా క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించడం అనేది ఆయనకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఆయన నటన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసాడనే చెప్పాలి… ఇక మీనాక్షి చౌదరి కూడా ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ను అయితే ఇచ్చింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలోని ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు మెప్పించడం అనేది సినిమాకి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి.

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాలో సాంగ్స్ పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సీన్ కి, సీన్ కి మధ్య ఆ వేరియేషన్ ను చూపించడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు అయిన జీవి ప్రకాష్ కుమార్ చాలా ఫ్రెష్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇవ్వడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సీన్ ని ఎలివేట్ చేయడంలో కూడా ఆయన తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా బాగా మెప్పించాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కొత్త షాట్లకి వెళ్లకుండా నార్మల్ గానే ఈ సినిమా మొత్తాన్ని లాగించారు. ముఖ్యంగా నిమిష్ రవి తన సినిమాటోగ్రఫీతో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు.

అనవసరమైన షాట్స్ కి వెళ్లకుండా సీన్ ఇంటెన్స్ ని బట్టి ఆయన షాట్స్ ని కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తుంది… నవీన్ నూలి కూడా సినిమాని షార్ట్ కట్ లో కట్ చేసి సినిమా మీద క్యూరియాసిటిని పెంచే విధంగా ఎడిటింగ్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

దుల్కర్ సల్మాన్ యాక్టింగ్
స్టోరీ
బ్యాగ్రౌండ్ స్కోర్…

మైనస్ పాయింట్స్

మధ్యలో కొంచెం బోర్ కొట్టించింది…
కొన్ని క్యారెక్టర్స్ కి మోటివ్ పాయింట్ లేకపోవడం…

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్

ఈ పండక్కి అందరూ ఫ్యామిలీ అంత కలిసి చూడాల్సిన సినిమా…