సౌత్‌లో అన్ని భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ఈ మధ్యే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్షయ్ కుమార్ సూపర్ హిట్ మూవీ ‘మిషన్ మంగల్’లో యువ సైంటిస్ట్‌గా నటించి మెప్పించింది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ పోషించిన ‘బ్రీత్2 ఇన్ టూ ద షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేసింది. సహజంగానే నిత్య మంచి నటి. కళ్లతోనే హావభావాలు పలికిస్తుంది. హైట్, అందం, మంచి శరీరాకృతి లేకున్నా కూడా తన నటనతోనే ఆమె ముందుకెళ్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది. చూడ్డానికి చిన్నదిగా కనిపించినా ఆమె వయసు పెద్దదే. ఏప్రిల్‌లోనే 32వ బర్త్‌డే చేసుకుంది. దాంతో, పెళ్లెప్పుడు అని చాలా మంది ఆమెను అడుగుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదని చెప్పింది. కానీ, ఓ స్టార్ హీరో మాత్రం వెంటనే పెళ్లి చేసుకొమ్మని తరచూ చెబుతున్నాడట.
బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!
ఆ స్టార్ మరెవరో కాదు మమ్ముట్టీ కొడుకు దుల్కర్ సల్మన్. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ దక్షిణాదిలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. నిత్య మీనన్‌తో కలిసి అతను ‘ఓకే కాదల్’లో నటించాడు. ఈ మూవీ తెలుగులో ఓకే బంగారం పేరుతో డబ్ అయింది. ఈ మూవీ చేస్తుండగానే నిత్యతో అతనికి మంచి ప్రెండ్షిప్ కుదిరింది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని తనకు చెబుతున్నాడని నిత్య చెప్పింది. చాలాసార్లు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పులను కూడా వివరించాడని చెప్పింది. వివాహ బందం గురించి దుల్కర్ అంత గొప్పగా చెబుతుంటే ఒక్కోసారి తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అని తెలిపింది. కాగా, దుల్కర్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. అతను అమల్ సుఫియాను 2011లోనే వివాహం చేసుకోగా.. వీరికి అమీరా సల్మాన్ అనే కూతురు ఉంది. పెళ్లి తర్వాత జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్న దుల్కర్ అందుకే నిత్యకు కూడా పెళ్లి చేసుకోవాలని చెబుతున్నాడు. మరి, ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి.