Closure of Theaters in AP: ఏపీలో భీమ్లానాయ‌క్ షో వేయ‌లేక థియేట‌ర్ల మూసివేత‌.. అస‌లు కార‌ణాలు ఇవే

Closure of Theaters in AP: మొద‌టి నుంచి భీమ్లానాయ‌క్ మీద ఎన్ని అంచ‌నాలు ఉన్నాయో.. అన్నే వివాదాల మ‌ధ్య రిలీజ్ అయిపోయింది. ముఖ్యంగా ఏపీలో టికెట్ల రేట్ల అంశం ఈ మూవీకి పెద్ద చిక్కు ముడిగా మారిపోయింది. మూవీ రిలీజ్ అయిన వారం త‌ర్వాత టికెట్ల రేట్లు పెరుగుతాయ‌నే అంచాన‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ మూవీకి త‌గ్గించిన టికెట్ల రేట్లే అందుబాటులో ఉన్నాయి. పైగా ప్ర‌భుత్వ అధికారులు ప‌క్కాగా ప్ర‌తి థియేట‌ర్ ద‌గ్గ‌ర […]

Written By: Mallesh, Updated On : February 26, 2022 1:05 pm
Follow us on

Closure of Theaters in AP: మొద‌టి నుంచి భీమ్లానాయ‌క్ మీద ఎన్ని అంచ‌నాలు ఉన్నాయో.. అన్నే వివాదాల మ‌ధ్య రిలీజ్ అయిపోయింది. ముఖ్యంగా ఏపీలో టికెట్ల రేట్ల అంశం ఈ మూవీకి పెద్ద చిక్కు ముడిగా మారిపోయింది. మూవీ రిలీజ్ అయిన వారం త‌ర్వాత టికెట్ల రేట్లు పెరుగుతాయ‌నే అంచాన‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ మూవీకి త‌గ్గించిన టికెట్ల రేట్లే అందుబాటులో ఉన్నాయి. పైగా ప్ర‌భుత్వ అధికారులు ప‌క్కాగా ప్ర‌తి థియేట‌ర్ ద‌గ్గ‌ర గ‌స్తీ కాస్తున్నారు. ఎక్కువ ధ‌ర‌కు టికెట్లు అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Telangana Govt Bheemla Nayak

అయితే ఎలాగోలా మూవీ రిలీజ్ అయి సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఎన్నో రోజుల త‌ర్వాత థియేట‌ర్ల ద‌గ్గ‌ర క‌రోనాకు ముందు రోజులు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్‌కు పాలాభిషేకాలు, పూలాభి షేకాలు చేస్తున్నారు అభిమానులు. కాగా ఇలా కొన్ని ఏరియాల్లో ఉంటే.. మ‌రికొన్ని ఏరియాల్లో సీన్ రివ‌ర్స్ అవుతోంది. త‌గ్గించిన టికెట్ల రేట్లతో థియేట‌ర్ల య‌జ‌మానులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

Also Read:   “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం

పైగా ప్ర‌భుత్వ అధికారులు నిత్యం త‌నిఖీలు చేస్తుండ‌టంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొన్న వ‌చ్చిన బంగార్రాజు మూవీ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భుత్వం.. ప‌వ‌న్ మూవీ విష‌యానికి వ‌చ్చే స‌రికి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇటు అధికారుల వేధింపులు, అటు త‌క్కువ రేట్ల‌కు టికెట్లు అమ్మ‌లేక చాలా థియేట‌ర్ల సినిమాను నిలిపివేస్తున్నాయి.

jagan, pawan

రాయ‌ల సీమ‌, కృష్ణా, నెల్లూరు ఇలా చాలా జిల్లాల్లో సినిమా థియేట‌ర్లు మూసేశారు. గేట్ల ముందు తాము సినిమాను వేయ‌డం లేదంటూ నోటీసులు అంటించారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ అక్క‌డే ప‌డిగాపులు కాస్తున్నారు. అలాగే విస్సన్నపేట, మైలవరం లాంటి చోట్ల కూడా థియేట‌ర్లు మూసేశారు. దీంతో ఆగ్ర‌హించిన ప‌వ‌న్ ఫ్యాన్స్ అక్క‌డే నిర‌స‌న‌లు కూడా తెలుపుతున్నారు. థియేట‌ర్ల మీద రాళ్లు రువ్వుతున్నారు. ఈ ఆందోళ‌న‌ల‌తో ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. కొన్ని చోట్ల ప‌రిస్థితి ఉద్రిక్తంగా కూడా మారుతోంది. మ‌రి వీటికి ఎక్క‌డ పులిస్టాప్ ప‌డుతుందో చూడాలి.

Also Read: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

Tags