https://oktelugu.com/

Dill Raju : సంక్రాంతి కి బాలయ్య కి ధియేటర్లు దొరకడం కష్టమే…బాలకృష్ణ ను అడ్డం గా బుక్ చేసిన దిల్ రాజు…

స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు ఒకరు... ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అలాగే ఆయన చేసే సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లని సాధిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 03:40 PM IST

    Dill Raju

    Follow us on

    Dill Raju :  సంక్రాంతి సీజన్ వస్తుంది అనగానే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మొదటగా ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ పండక్కి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.అయితే సంక్రాంతి అనేది మన పండుగల్లో చాలా పెద్ద పండుగ కాబట్టి ప్రతి సినిమాని ఆ పండుగ రోజు రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలని ప్రతి ఒక్క నిర్మాత కోరుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ సంక్రాంతి బరిలో నిలవగా బాలయ్య బాబు కూడా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని సంక్రాంతి రేసులో ఉంచాడు…ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది… ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు కూడా దిల్ రాజు గారివే కావడం వల్ల ఆయన భారీ ఎత్తున థియేటర్లని ఆ రెండు సినిమాలకే కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజుకు భారీ థియేటర్లు ఉన్నాయి. కాబట్టి ఆ థియేటర్లలో తన సినిమాలను రిలీజ్ చేసుకుంటాడు. కాబట్టి ఈ రెండు సినిమాలకి భారీ థియేటర్లను కేటాయించి మిగిలిన సినిమాలకి పాత థియేటర్లను కేటాయించే అవకాశం అయితే ఉంది.

    మరి ఈ క్రమంలో బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో సినిమా కూడా వస్తున్న నేపధ్యంలో ఆయన సినిమాకు థియేటర్లను కేటాయించకపోతే బాలయ్య బాబు ఊరుకుంటాడా? పాతబడిన, అసలు బాలేని థియేటర్లని బాలయ్య బాబు సినిమాకి కేటాయిస్తే మాత్రం యాక్షన్ వేరే విధంగా ఉంటుందని దిల్ రాజు మీద చాలామంది సెటైర్లు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు గుత్తాధిపత్యం కొనసాగుతుందనే విషయం చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తుంది.

    ఇక గత రెండు, మూడు సంక్రాంతి సీజన్లలో కూడా దిల్ రాజు తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఎక్కువ థియేటర్లలో తన సినిమాలను రిలీజ్ చేసుకున్న సందర్భాలను కూడా మనం చూశాం. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవ్వబోతుందా? ఒకవేళ అలా చేస్తే బాలయ్య బాబు పరిస్థితి ఏంటి దిల్ రాజుకి బాలయ్య బాబుకి మధ్య భారీ గొడవ జరగబోతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…

    ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలువబోతున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి… మరి మొత్తానికైతే ఏ సినిమాలు సంక్రాంతికి వస్తాయి.. ఏ సినిమాలు సంక్రాంతి నుంచి తప్పుకుంటాయి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…