https://oktelugu.com/

IND VS NZ Test Match : స్పిన్ ఆడడం రాదా.. మీరు ఇండియాలోనే పుట్టారా? టీమిండియా క్రికెటర్లను తిట్టనోళ్లు లేరు

ముత్తయ్య మురళీధరన్.. షేన్ వార్న్, నాథన్ లయన్, అజంతా మెండిస్, సక్లయిన్ మస్తాక్, డానియల్ వెటోరి వంటి దిగ్గజ స్పిన్ బౌలర్లకు ప్రపంచంలోని అన్ని జట్లపై మెరుగైన గణాంకాలు ఉంటాయి. కానీ భారత్ విషయానికి వచ్చేసరికి వారిది అంతంత మాత్రమైన ప్రదర్శనే. కారణం మన ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 / 04:02 PM IST

    IND VS NZ Test Series

    Follow us on

    IND VS NZ Test Match :  టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. దిగ్గజ ఆటగాళ్లు సైతం బంతులను టచ్ కూడా చేయలేకపోతున్నారు. న్యూజిలాండ్ జట్టుపై ముంబై వేదికగా జరిగిన మూడవ టెస్టులో, అంతకు ముందు జరిగిన పూణే టెస్టులో ఇది నిరుపితమైంది. దానికంటే ముందు శ్రీలంక వన్డే సిరీస్ లోనూ భారత్ ఇదే విధంగా తడబడింది. చాలా సంవత్సరాల తర్వాత వైట్ వాష్ కు గురైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు పరువు తీసుకుంది. దీంతో భారత జట్టు WTC ఫైనల్ వెళ్లడం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.. వాస్తవానికి భారత క్రికెటర్లు స్పిన్ బౌలింగ్ లో ఇలా తేలిపోవడం ఇది తొలిసారి కాకపోయినప్పటికీ.. గతంతో పోల్చితే ఇది దారుణమే అని చెప్పొచ్చు. 2016 నుంచి 2020 వరకు భారత జట్టులో టాప్ ఏడుగురు ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో సరాసరి 63 రన్స్ చేశారు. 2021 నుంచి అది క్రమంగా తిరోగమనం దిశలో సాగుతోంది. 2021 నుంచి ఇప్పటివరకు భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో సరాసరి 37 పరుగులు మాత్రమే చేస్తున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత లో ఆటగాళ్లు ఏ స్థాయిలో విఫలమవుతున్నారో చెప్పడానికి.. 2021 నుంచి భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి ఆటగాళ్లు స్పిన్ బౌలర్ల చేతిలో దారుణంగా విఫలమవుతున్నారు. రోహిత్, విరాట్ 20 సార్లు అవుట్ అయ్యారు. గిల్ 15 సార్లు, యశస్వి జైస్వాల్ 8 సార్లు అవుట్ అయ్యారు. అక్కడిదాకా ఎందుకు శ్రీలంక జట్టుకు చెందిన దునిత్ వెల్లలాగే లాంటి వర్ధమాన స్పిన్ బౌలర్ బౌలింగ్ ను సైతం భారత ఆటగాళ్లు ఎదుర్కోలేకపోతున్నారు..

    ముంబై లోనూ..

    న్యూజిలాండ్ సిరీస్ కంటే ముందు బంగ్లాదేశ్ జట్టుపై భారత్ టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కానీ అదే ఊపు న్యూజిలాండ్ జట్టుపై కొనసాగించలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ పై కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కానీ భారత గడ్డపై ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చూపించింది. స్పిన్ బౌలింగ్ తో టీమిండియాను కట్టడి చేసింది. రోహిత్ నుంచి మొదలు పెడితే సర్ఫరాజ్ ఖాన్ వరకు అందరిని బోల్తా కొట్టించింది. ఈ పరిణామం టీమిండియా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఇలాంటి ఆట తీరే కొనసాగిస్తే టీమిండియా టెస్ట్ భవితవ్యం ప్రమాదంలో పడుతుందనే ఆందోళన కలుగుతోంది. టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టి20 మాదిరిగానే టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలకాలనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.