Drushyam 2 Telugu Movie Review: దృశ్యం2 రివ్యూ

Drushyam 2 Telugu Movie Review: నటీనటులు: వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు; రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌, నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌. రేటింగ్ : 2.5 ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్‌ […]

Written By: Shiva, Updated On : November 25, 2021 12:44 pm
Follow us on

Drushyam 2 Telugu Movie Review:
నటీనటులు:
వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు;
రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్‌,
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్,
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌,
నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి,
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌.
రేటింగ్ : 2.5

Drushyam 2 Telugu Movie

ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్‌ గా వచ్చిన మరో ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ..

కథ విషయానికొస్తే.. ‘దృశ్యం’ మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో.. అక్కడ నుంచే రెండో భాగం మొదలైంది. గతంలో ‘వరుణ్‌ కేసు నుంచి బయటపడిన రాంబాబు (వెంకటేశ్‌) ఫ్యామిలీ’ ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అలాగే రాంబాబు కూడా కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ స్థాయి నుంచి థియేటర్‌ ఓనర్‌గా ఎదుగుతాడు. కానీ, వరుణ్‌ కేసు తాలూకు అవమానాలు, భయాలు రాంబాబు ఫ్యామిలీని మానసికంగా ఇంకా వెంటాడుతూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఈ కేసును సీక్రెట్‌ గా విచారిస్తుంటారు. ఐజీ గౌతమ్‌ సాహూ (సంపత్‌ రాజ్‌) పర్సనల్ గా రాంబాబును అతని ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. మరి, వారి నుంచి తప్పించుకోవడానికి రాంబాబు ఎలాంటి ఆధారాలు సృష్టించాడు ? చివరకు రాంబాబు ఈ కేసు నుంచి బయట పడ్డాడా ? లేదా ? తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు ? ఈ మధ్యలో జరిగిన డ్రామా ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

హత్య కేసు నుంచి రాంబాబు (వెంకటేశ్‌) తన ఫ్యామిలీని కాపాడుకోవాదానికి ఏం చేశాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వచ్చే మలుపులు, మరియి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్. ఇక మొత్తం పోలీస్ వ్యవస్థ చేసిన టార్గెట్ నుంచి తెలివిగా బయటపడటానికి రాంబాబు తీసుకునే నిర్ణయాల తాలూకు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి.
అయితే, ‘దృశ్యం’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ ‘దృశ్యం 2’లో మాత్రం మొదటి పార్ట్ లో ఉన్నంత ఎమోషన్ గానీ, సస్పెన్స్ గానీ లేదు. అసలు రీమేక్‌ కథలను రక్తికట్టించాలి అంటే, ముందు నేటివిటీలో సహజత్వం ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ చిత్రంలో నేటివిటీతో పాటు పాత్రల స్థితిగతుల్లో కూడా తెలుగుదనం లేకపోవడం విచిత్రం. పైగా ఒక విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి.

కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ‘దృశ్యం 2’ సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అయింది. పర్ఫెక్ట్ కథ, కథనాలను రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తడబడ్డాడు. కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అయ్యే తండ్రిలో పిల్లల పై ఉన్న ప్రేమను చెప్పించాడు గానీ, ఆ ప్రేమ ఎలివేట్ అయ్యేలా కనీసం ఒక్క బలమైన సీన్ ను కూడా చూపించలేకపోయాడు.

అయినా వరుణ్‌ మర్డర్ కేసు చుట్టూ సినిమాని నడపడం, పైగా ఆ కేసు నుంచి బయటపడటమే సినిమా కావడం, దానికి తోడు క్లైమాక్స్‌ చూస్తేనే సినిమాలో అసలు మ్యాటర్ అర్థం కావడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. ఇక పోలీస్‌ శాఖ సీక్రెట్‌ గా ఇన్వెస్టిగేట్‌ చేసే సీన్స్ కూడా సీరియల్స్ లోని డ్రామా తలపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :
వెంకటేశ్‌, మిగిలిన నటీనటులు నటన,
క్లైమాక్స్,
సంగీతం,
సస్పెన్స్ సీన్స్

Also Read: వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ.. మీరు చూశారా?

మైనస్ పాయింట్స్ :

బోరింగ్ ప్లే,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
తెలుగు నేటివిటీ మిస్ అవ్వడం,

సినిమా చూడాలా ? వద్దా ?

సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఒకసారి చూడోచ్చు. కాకపోతే, సినిమాలో చూపించిన లాజిక్ లెస్ డ్రామా ఈ డిజిటల్ ప్రపంచంలో బయట ఎక్కడా కనిపించక పోవచ్చు. కాబట్టి, సినిమాని సినిమాగా చూస్తేనే ఈ ఎమోషనల్ జర్నీలోని థ్రిలింగ్ ఎలిమెంట్స్ కు కనెక్ట్ అవుతారు. లేదంటే.. ఎమోషన్ కి తక్కువగా, ఇరిటేషన్ కి ఎక్కువగా ఫీల్ అవ్వాల్సి వస్తోంది.

Also Read: Samantha: నీ పెంపుడు కుక్కకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా చైతూకు లేదా సమంత!

Tags