మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘దృశ్యం’ చిత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు , అన్ని భాషల్లోనూ సెన్సేషన్ సృష్టించింది. ఈ సిరీస్ లోని ట్విస్టులు మూవీ లవర్స్ కి ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అలాంటి సిరీస్ నుండి వస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమాలో కూడా అదే రేంజ్ ట్విస్టులు , థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని ఆశించారు ఆడియన్స్. కానీ ఆ రేంజ్ లో లేవు , అయినప్పటికీ క్రేజీ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన సినిమా కాబట్టి , ఈ చిత్రానికి వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లోనే వచ్చాయి.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ఒక్క కేరళ ప్రాంతం నుండే ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తమిళ నాడు ప్రాంతం నుండి 9 కోట్లు , కర్ణాటక ప్రాంతం నుండి 14 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి ప్రాంతం అయితే ఈ చిత్రానికి క్లోజింగ్ లో 121 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం గమనార్హం. సూపర్ హిట్ టాలీవుడ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి నమోదు అవ్వడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో , డివైడ్ టాక్ వచ్చిన చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ నమోదు అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 30 కోట్ల రూపాయలకు మాత్రమే. అంటే దాదాపుగా 76 కోట్ల రూపాయిల లాభాలు ఈ చిత్రానికి వచ్చాయి. ఈమధ్య కాలం లో డివైడ్ టాక్ వచ్చిన ఒక చిత్రానికి ఈ రేంజ్ లాభాలు రావడం అనేది ఎక్కడా జరగలేదు. థియేటర్స్ లో ఈ రేంజ్ సునామీ సృష్టించిన ఈ సినిమాకు ఓటీటీ లో విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.

