Drishyam 3 Collections: మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , ఆడియన్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువకు జరగడం తో , కేవలం వీకెండ్ తోనే ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కేవలం మలయాళం లోనే కాదు , తెలుగు , తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 75 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 5 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు అక్షరాలా 3 కోట్ల రూపాయిలు , ఇక కేవలం 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటినట్టే.
చాలా కాలం తర్వాత మోహన్ లాల్ కి తెలుగు లో ఒక సూపర్ హిట్ చిత్రం గా ‘దృశ్యం 3’ నిలవబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , కేరళ రాష్ట్రము నుండి 45 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 10 లక్షలు, తమిళనాడు రాష్ట్రము నుండి 5 కోట్ల 75 లక్షలు, కర్ణాటక రాష్ట్రం నుండి 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 65 లక్షలు , ఓవర్సీస్ నుండి 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేరళ రాష్ట్రంలో వచ్చిన వసూళ్లకంటే ఓవర్సీస్ లో వచ్చిన వసూళ్లు రెండింతలు ఉండడం సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి కేవలం 30 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు రాబోతున్నాయి ఊహించుకోవచ్చు. అయితే నాల్గవ రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి, కానీ 5 వ రోజున కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి . అంటే దాదాపుగా 50 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి అన్నమాట. లాంగ్ రన్ కి ఇది శుభ సూచికం కాదు, రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
