https://oktelugu.com/

Drisham 3 : ‘దృశ్యం 3’ వచ్చేస్తోంది..కానీ ఈసారి హీరో వెంకటేష్ కాదా?

అతి త్వరలోనే దృశ్యం -3 ని విడుదల చెయ్యబోతున్నాడు మోహన్ లాల్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడే విడుదల అయ్యింది.

Written By: , Updated On : June 14, 2023 / 03:18 PM IST
Follow us on

Drisham 3 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత తెలుగు లో వెంకటేష్, తమిళం లో కమల్ హాసన్ మరియు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఈ సినిమాని రీమేక్ చేసి హిట్స్ కొట్టారు.

ఈ చిత్రానికి సీక్వెల్ ని మలయాళం లో తీస్తే, దానిని కూడా తెలుగు మరియు హిందీ లో వెంకటేష్ , అజయ్ దేవగన్ లు రీమేక్స్ చేసి విడుదల చేసారు. తెలుగు మరియు మలయాళం భాషల్లో లాక్ డౌన్ సమయంలో డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేస్తే, హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా అతి త్వరలోనే దృశ్యం -3 ని విడుదల చెయ్యబోతున్నాడు మోహన్ లాల్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడే విడుదల అయ్యింది. ఇందులో చేతికి బేడీలు వేసుకున్న  మోహన్ లాల్ ని మనం చూడవచ్చు. ఇదే దృశ్యం సిరీస్ కి ఆఖరి చిత్రం అట. ఈ చిత్రాన్ని కూడా తెలుగు లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నారు కానీ, వెంకటేష్ అందుకు ఆసక్తిగా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త. ఈ సినిమాలో టాలీవుడ్ లో వెంకటేష్ ని తప్ప ఎవరినీ ఊహించుకోలేము.

అందుకే ఈ మలయాళం వెర్షన్ ని తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ జీతూ జోసెఫ్. కానీ ఈ సినిమా వెంకటేష్ చేస్తే చాలా బాగుంటుందని,దృశ్యం 2 సినిమాని థియేట్రికల్ కి ఇవ్వకుండా ఓటీటీ కి ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేసారు. ఇప్పుడు ఈ సినిమాని కాదని మరో పొరపాటు చెయ్యొద్దు అంటూ వెంకటేష్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ బ్రతిమిలాడుతున్నారు.మరి వెంకటేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకుంటాడో లేదో చూడాలి.