Dragon : తెలుగు , తమిళ భాషల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘డ్రాగన్’|(Return Of The Dragon) చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని, రీసెంట్ గానే హిందీ లో కూడా డబ్ చేసి విడుదల చేసారు. రెస్పాన్స్ పెద్దగా రాలేదు. సినిమాని మేకర్స్ ప్రొమోషన్స్ ద్వారా హిందీ ఆడియన్స్ కి చేరువ చేయకపోవడం వల్లే అక్కడ క్లిక్ అవ్వకపోవడానికి కారణమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలా మందికి ఈ సినిమా హిందీ లో విడుదల అయ్యిందనే విషయం కూడా తెలియదు. ఇక ఈ వారం తో థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నందున, ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ చాలా రోజుల క్రితమే కొనుగోలు చేసింది.
Also Read : అక్షరాలా 150 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’..23 వ రోజు ఎంత వసూళ్లు వచ్చిందో తెలుసా?
తెలుగు తో పాటు హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ నెల 21 వ తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. అంటే ఈ వీకెండ్ లోనే రాబోతుంది అన్నమాట. థియేటర్స్ లో వెళ్లి చూసే ఓపిక లేక ఓటీటీ విడుదల కోసం ఎదురు చూసే ఆడియన్స్ కి ఇది పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. గతం లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లవ్ టుడే’ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ‘డ్రాగన్’ చిత్రానికి అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ లో మీడియం రేంజ్ సినిమాల హవానే ఎక్కువ నడుస్తుంది.
గత ఏడాది నవంబర్ లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత విడుదలైన పెద్ద చిత్రాలు సైతం కొన్ని రోజులు ట్రెండ్ అయ్యి వెళ్లిపోయాయి. కానీ ‘లక్కీ భాస్కర్’ మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది. కనీసం ‘డ్రాగన్’ ఎంట్రీ తర్వాత అయినా ‘లక్కీ భాస్కర్’ ట్రెండింగ్ నుండి వెళ్లిపోతుందో లేదో చూడాలి. డ్రాగన్ చిత్రానికి కూడా ఆ స్థాయిలో ట్రెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది మరి. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంట్లో కూర్చొని చూడదగ్గ సినిమా అది. ఈ చిత్రం తర్వాత ప్రదీప్ రేంజ్ మారిపోయింది. మన తెలుగు లో కూడా ఆయన హీరోగా చేయడానికి రెండు సినిమాలు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంకొక్క సినిమా హిట్ అయితే ప్రదీప్ తమిళనాడు లో యూత్ ఐకాన్ గా కూడా మారిపోవచ్చు.
Also Read : ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్..’డ్రాగన్’ హీరో కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ‘పుష్ప 2’ మేకర్స్!