Dragon Collection: చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాలను డామినేట్ చేయడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి ట్రెండ్ ఉండేది, మళ్లీ ఇప్పుడు అది రిపీట్ అయిపోతుంది. రీసెంట్ గా విడుదలైన ‘డ్రాగన్'(Return of the Dragon Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ‘లవ్ టుడే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన ఈ సినిమా ‘లవ్ టుడే’ కంటే కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ దుమ్ము దులిపేసింది. తెలుగు వెర్షన్ లో ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కేవలం నాలుగు కోట్ల రూపాయలకే జరిగింది.
Also Read: సితారకు ఇష్టమైన ఈ తరం హీరోయిన్స్ ఎవరో తెలుసా? ఇక హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
అంటే పెట్టిన డబ్బులకు మూడు రెట్లు లాభం అన్నమాట. ఇలాంటి మ్యాజిక్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి, మన సౌత్ లో గడిచిన ఆరు నెలల్లోనే ఇలాంటి మ్యాజిక్స్ రెండు మూడు సార్లు జరిగింది. ఇకపోతే ఈ చిత్రం అతి త్వరలోనే 150 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది. 23 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు 146 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తమిళనాడు నుండే ఈ చిత్రానికి 78 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తమిళనాడు లో ఒక చిన్న హీరో కి ఈ రేంజ్ వసూళ్లు సాధారణమైన విషయం కాదు. ధనుష్, సూర్య, శింబు లాంటి హీరోలకే ఇంత వసూళ్లు ఇప్పటి వరకు రాలేదంటే నమ్ముతారా?, కానీ నిజంగానే రాలేదు. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎంత వసూళ్లు వచ్చాయో పైన చెప్పేశాం, మిగిలిన ప్రాంతాల్లో ఎంత వచ్చాయో చూద్దాం.
కర్ణాటక లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ లో 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 146 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 71 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే భవిష్యత్తులో ఈ చిత్రం 160 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవలే ఈ చిత్రం హిందీ లో కూడా విడుదలైంది. కానీ అక్కడ మాత్రం అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మూవీ యూనిట్ సరిగ్గా ప్రొమోషన్స్ చేసి ఉండుంటే మంచి కలెక్షన్స్ వచ్చేవి కానీ, అలా జరగలేదు. ఇదొక్కటే మూవీ టీం కి కాస్త నిరాశ కలిగించే విషయం అనొచ్చు.
Also Read: మహేష్ బాబు తో పోటీ పడి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న హీరోలు వీళ్లేనా..?