Dragon
Dragon : ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలకు రావాల్సిన భారీ వసూళ్లు, చిన్న హీరోలకు కూడా వస్తున్నాయంటే, జనాలు కంటెంట్ ఉన్న సినిమాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి సీనియర్ హీరో వెంకటేష్(Victory Venkatesh) సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు వెంకటేష్ కి కనీసం 50 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 300 కోట్లు రాబట్టిందంటే జనాలు కంటెంట్ సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తున్నారు అనే దానికి ఉదాహరణగా చూడొచ్చు.
ఈ సినిమా వచ్చిన నెల రోజులకే మరో సినిమా ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన డ్రాగన్ (Dragon Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి తమిళ బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాకుండా, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేస్తుంది. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కేవలం టాలీవుడ్ నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ నాలుగు కోట్లు మాత్రమే. తెలుగు వెర్షన్ లో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకున్న ఈ సినిమా తమిళనాడు లో మొదటి వారం 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక ఓవర్సీస్, కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా కలిపి మరో పాతిక కోట్ల రూపాయిల గ్రాస్, ఓవరాల్ గా మొదటి వారం లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 81 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు, తల అజిత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘విడాముయార్చి’ కి క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ గా 145 కోట్ల రూపాయిలు వచ్చాయి. రెండవ వారం లో ఈ సినిమా వసూళ్లను అవలీలగా దాటేయబోతుంది ‘డ్రాగన్’ చిత్రం. కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రభంజనం చూసారా?, కంటెంట్ కి ఉన్న పవర్ అలాంటిది, వందల కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాలు అవసరమే లేదు. కంటెంట్ ఉంటే చాలు, అదే వందల కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుంది. మేకర్స్ ఇప్పటికైనా కంటెంట్ మీద ఎక్కువగా ద్రుష్టి సారిస్తారని ఆశిస్తున్నాము అంటూ విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ‘డ్రాగన్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..రజినీకాంత్, అజిత్ రికార్డులు అవుట్..ఇది మామూలు మాస్ ర్యాంపేజ్ కాదు!