Homeఆంధ్రప్రదేశ్‌Posani Krishna Murali: ఆ బూతులే పోసాని అరెస్ట్ కు కారణమయ్యాయా? కూటమి కక్షగట్టి లోపలేసిందా?

Posani Krishna Murali: ఆ బూతులే పోసాని అరెస్ట్ కు కారణమయ్యాయా? కూటమి కక్షగట్టి లోపలేసిందా?

Posani Krishna Murali: ‘ సైకో వెధవ, దరిద్రపు నా..కొ… దొంగ, లోఫర్, బేవార్స్, తిరుగుబోతు, తాగుబోతు, చేతకాని నా కొ.., ఆంబోతు, దొంగ ల.. కొ.., పుల్లకు చీర కట్టిన చూస్తావ్.. ఆ అమ్మాయి ఎవరని?.. నీచుడా.. సిగ్గులేని నా కొ.. పార్టీ లాగేసుకోవడానికి అమ్మాయిలను పంపించాడు.. బ్రోకర్ గాడివి.. రక్త కన్నీరు పెట్టుకుంటావ్ దరిద్రపు నా కొ..’.. ఇటువంటి మాటలు అన్నది ఎవరో తెలుసు కదా? దర్శక రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ). సినిమాల్లో సందర్భోచితంగా వాడితే ఆ కథ ప్రేక్షకాదరణ పొందుతుంది. నిజజీవితంలో వాడితే ఇప్పుడు పోసాని కృష్ణ మురళీ మాదిరిగా జైలు పాలు కావడం ఖాయం. నిన్న హైదరాబాదులో పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోసానిని అరెస్టు చేయడమా? ఆయన్ను అరెస్టు చేసినంత తప్పులు ఏం చేశారు? వంటి ప్రశ్నలు వేస్తే మాత్రం సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న పాత వీడియోలు సమాధానాలుగా మారుతున్నాయి.

Also Read: పోసాని వర్సెస్ ఏపీ పోలీసులు.. అరెస్టుకు ముందు మై హోమ్ భుజ లో ఏం జరిగిందంటే?

* అరెస్టు ఊహించినదే
పోసాని కృష్ణ మురళి అరెస్టు ఊహించినదే. ఎన్నికల ఫలితాలు( election results ) వచ్చిన తర్వాత ఆయన చాలా రకాలుగా కూడా మాట్లాడారు. వైసిపి తరఫున మాట్లాడుకొచ్చారు. అయితే వన్ ఫైన్ మార్నింగ్ మాత్రం మాట మార్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి రాజకీయాల కోసం మాట్లాడానికి కూడా చెప్పారు. అయితే ఇదంతా కేసుల భయంతో చేసినదేనని తేలిపోయింది. అయితే ఇప్పుడు నేరుగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే భయపడిన మనిషిగా, మారిన మనిషిగా ఉన్న.. ఏపీ పోలీసులు వదలకపోవడానికి గతంలో ఆయన వాడిన భాష, పదప్రయోగమే కారణమని తేలిపోయింది.

* సానుభూతి సైతం చూపించే పరిస్థితి లేదు
సాధారణంగా రాజకీయ అరెస్టులు( political arrests ) జరిగినప్పుడు సానుభూతి చూపించడం పరిపాటి. అలాంటి సానుభూతి పోసాని కృష్ణ మురళి పై కూడా చూపిన వారు ఉన్నారు. అయితే ఆయన గతంలో వాడిన మాటలు, పదప్రయోగం చూసిన తరువాత ఆయన అరెస్టును సమర్థించిన వారు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీడియాతో మాట్లాడుతూ నోటికి అడ్డు అదుపు లేకుండా కామెంట్స్ చేశారు. ఆ వీడియోలు చూసినవారు అరెస్టులో న్యాయం ఉందన్న భావన వ్యక్తపరుస్తున్నారు. నలుగురు ఎదుట గౌరవప్రదంగా మాట్లాడడానికి భిన్నంగా.. నోటికి వచ్చినట్లుగా బూతులు మాట్లాడారు పోసాని కృష్ణ మురళి. నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడి.. సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. నాటి పాపాలే శాపాలుగా మారి పోసాని కృష్ణ మురళిని వెంటాడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* తప్పులు తెలుసుకుంటే మంచిది
తనను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను( AP Police ) ప్రశ్నల వర్షం కురిపించారు పోసాని. ఒకానొక దశలో భయపెట్టారు.. ఇంకొక దశలో తనకు అనారోగ్యం అని జాలి చూపాలని కోరారు. ఇంకోవైపు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అయితే అంతవరకు ఓకే కానీ. గత ఐదేళ్లుగా తన వ్యవహార శైలి. తాను వాడిన భాష వంటివి తెలుసుకుంటే తాను ఏం తప్పు చేశానో పోసాని కృష్ణ మురళికి ఇట్టే అర్థమవుతుంది. తెలుసుకోవాల్సింది ఆయనే.

Also Read: ఆ ఒక్క ట్వీట్ ఆ నేత కొంప ముంచనుందా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version