Sekhar Movie: రాజశేఖర్ నటించిన “శేఖర్” చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల…

Sekhar Movie: రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం కావడం విశేషం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 26, 2021 11:48 am
Follow us on

Sekhar Movie: రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం కావడం విశేషం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

Sekhar Movie

ఈ చిత్రం నుంచి గ్లింప్స్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ లో ‘అరుకు  బంగ్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య జరగగా… ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించకుండా ఎవరీ గురించి వెయిట్‌ చేస్తున్నాడీయన అని అడుగుతాడు. అందుకు మీకు తెలియదా సార్‌… కొన్ని రోజుల క్రితం రిజైన్‌ చేశాడు కదా శేఖర్‌ అని అతని గురించే వెయిటింగ్‌ వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా. వాడు చేసేది మనకు చెప్పాడా అని టీజర్‌ ప్రారంభంలో హీరో పాత్ర గురించి చెప్పిన డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తాయి.

Also Read: Pawan Kalyan : లొకేషన్స్ వేటలో “హరిహర వీరమల్లు” మూవీ యూనిట్…

ఇక ఈ టీజర్‌లో రాజశేఖర్‌ తెల్లటి గుబురు గడ్డం, సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌ స్టైల్‌లో కనిపించి అలరించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. గరుడవేగ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఈ మూవీ తో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అని అంటున్నారు.

Also Read: Hyper Aadi – Raising Raju: హైపర్ ఆది టీమ్ కి అందుకే దూరమయ్యా… రైజింగ్ రాజు కామెంట్స్