Don’t Trouble The Trouble Teaser Review: ‘ కేరళలో స్టార్ హీరో గా కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఫహాద్ ఫాజిల్, మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘పుష్ప’ సిరీస్ తో పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ కి మన ప్రేక్షకులు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పుష్ప’ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారో , ఫహద్ ఫాజిల్ పోషించిన షికావత్ క్యారెక్టర్ కి కూడా ఆడియన్స్ అదే రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. తెలుగు లో ఇంత ఫేమ్ , క్రేజ్ వచ్చిన తర్వాత ఫహాద్ ఫాజిల్ ఎందుకు సైలెంట్ గా ఉంటారు చెప్పండి. అందుకే ఆయన హీరో గా టాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి కుమారుడు SS కార్తికేయ నిర్మిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ కూడా నిర్మాణం లో భాగం అయ్యింది.
ఈ చిత్రానికి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చిత్రం లోని ఫేమస్ డైలాగ్ ఇది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ని బట్టీ చూస్తుంటే , ఇందులో హీరో క్యారెక్టర్ కి ఒక అమ్మాయి దొరుకుంటుంది. హీరో ఒక మెజీషియన్. ఒకరోజు సరదాగా తన మ్యాజిక్ తో తన వద్ద ఉన్న అమ్మాయిని మాయం చేస్తారు. కేవలం సరదాగా చేసిన మ్యాజిక్ కి , ఆమె నిజంగానే మాయం అవుతుంది. ఇది తెలుసుకున్న హీరో ఆ చిన్నారిని చూసి ‘దెయ్యం దెయ్యం’ అంటూ భయపడుతాడు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే సినిమా స్టోరీ. ఫహాద్ ఫాజిల్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంటే , కచ్చితంగా అందులో ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అని చెప్పడానికి ఈ టీజర్ ఒక ఉదాహరణగా నిల్చింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా , కచ్చితంగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇప్పటికే మోలీవుడ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ కి మన తెలుగు ఆడియన్స్ మూడు సూపర్ హిట్స్ ని అందించారు. ఇప్పుడు అదే మోలీవుడ్ నుండి మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఫహాద్ ఫాజిల్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
View this post on Instagram
