Homeఎంటర్టైన్మెంట్Malayalam Thriller : క్షణక్షణం ఉత్కంఠరేపే మలయాళ థ్రిల్లర్ ఓటీటీలో, డోంట్ మిస్, ఎక్కడ చూడొచ్చు?

Malayalam Thriller : క్షణక్షణం ఉత్కంఠరేపే మలయాళ థ్రిల్లర్ ఓటీటీలో, డోంట్ మిస్, ఎక్కడ చూడొచ్చు?

Malayalam Thriller : మలయాళ చిత్రాలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో చిత్రాలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్న పరిశ్రమగా ఎదిగింది. ఇక క్రైమ్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు సిద్దహస్తులు. మాలీవుడ్ లో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 పలు భాషల్లో రీమేక్ అయ్యాయి. మంచి విజయాలు అందుకున్నాయి.

ఇటీవల కాలంలో విడుదలైన కిష్కిందకాండ, సూక్ష్మదర్శిని ఆద్యంతం అలరించాయి. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి. ఈ కోవలో వచ్చిన మరొక థ్రిల్లర్ రేఖా చిత్రం. అనుక్షణం ఉత్కంఠరేపుతూ సాగే క్రైమ్ థ్రిల్లర్ రేఖా చిత్రం. ఈ మూవీ జనవరి 9న థియేటర్స్ లోకి వచ్చింది. అసిఫ్ అలీ ప్రధాన పాత్ర చేశాడు. రేఖాచిత్రం జోఫీన్ టి. చకో దర్శకత్వం వహించాడు. రేఖాచిత్రం మూవీని కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ లోపు తెరకెక్కించారు. అనూహ్యంగా రూ. 55 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు భారీ లాభాలు పంచింది.

Also Read : చెట్టెక్కి కూర్చున్న ఈ కుర్రాడు టాలీవుడ్ ని షేక్ చేస్తున్న క్రేజీ హీరో, అమ్మాయిల ఫేవరేట్ స్టార్!

రేఖాచిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లోకి వచ్చిన దాదాపు రెండు నెలల అనంతరం మార్చ్ 7న రేఖాచిత్రం సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక రేఖాచిత్రం మూవీ కథ విషయానికి వస్తే… వివేక్ గోపి(అసిఫ్ అలీ) ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి. అతడు కొన్ని కారణాలతో సస్పెండ్ అవుతాడు. ఒక గ్యాంబ్లింగ్ కుంభకోణం తర్వాత తిరిగి విధుల్లో చేరతాడు. ఒక 40 ఏళ్లుగా పరిష్కారం కానీ మర్డర్ కేసును వివేక్ గోపీకి అప్పగిస్తారు. ఈ కేసును వివేక్ గోపీ ఎలా చేధించాడు అనేది సినిమా. దర్శకుడు జోఫీన్ టీ. చాకో అద్భుతంగా రేఖాచిత్రం మూవీని నడిపించారు.

Also Read : ఆ ఒక్క ట్రిక్ తో మొత్తం ఇండస్ట్రీని శాసించే రేంజ్ కు మలయాళ ఇండస్ట్రీ..

Rekhachithram - Trailer | Asif Ali |Anaswara Rajan |Jofin T Chacko |Mujeeb Majeed | Venu Kunnappilly

Exit mobile version