Malayalam Hero : బాల్యంలో తన మిత్రులతో ఆడుకుంటున్న ఈ కుర్రాడు ఒక స్టార్ హీరో. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిచ్చర పిడుగుకి మామూలు లేడీ ఫాలోయింగ్ లేదు. తెలుగులో వరుస హిట్స్ ఇస్తున్నాడు. మూడు విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన చిత్రం ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉంటుంది. ఆ ఫోటోలో మధ్యలో కూర్చున్న కుర్రాడు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరో అయ్యాడు.
దుల్కర్ కి మలయాళంలో పాటు హిందీ, తమిళ్ ఇండస్ట్రీస్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లో చిత్రాలు చేస్తాడు. తెలుగు ఆడియన్స్ దుల్కర్ ని బాగా ఆదరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ మహానటి. ఈ చిత్రంలో దుల్కర్ జెమినీ గణేశన్ రోల్ చేశాడు. సావిత్రి భర్త పాత్రలో మెప్పించాడు. సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్.
అనంతరం సీతారామం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్. ఈ ఎమోషనల్ లవ్ డ్రామా మనసులు పిండేసింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా రూపొందించారు. ఈ చిత్రం ఏకంగా రూ. 111 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో దుల్కర్ వరుసగా సినిమాలు చేసే సూచనలు కలవు.
దుల్కర్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అతన్ని బాగా ఇష్టపడతారు. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి లో చిన్న గెస్ట్ రోల్ చేశాడు. కల్కి చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. పరాయి భాషకు చెందిన హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు.
ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. ఇది కూడా స్ట్రెయిట్ తెలుగు చిత్రం. అలాగే కాంత టైటిల్ తో ఒక తమిళ చిత్రం చేస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి.