https://oktelugu.com/

Bigg Boss 18: బిగ్ బాస్’ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ‘గాడిద’..పిచ్చి ముదిరిపోయిందిగా..జనాలు ఎలా కనిపిస్తున్నారు?

మన దగ్గర కంటెస్టెంట్స్ మధ్య కాస్త రొమాన్స్ ఉన్న తట్టుకోలేము, వెంటనే ఆ కంటెస్టెంట్స్ ని బయటకి పంపేందుకు ప్రయత్నం చేస్తాము. కానీ హిందీ బిగ్ బాస్ లో అలా ఉండదు, ఇక్కడ రొమాన్స్ కూడా హద్దులు దాటి ఉంటుంది. అడల్ట్ సినిమాల్లో ఎలాంటి బోల్డ్ రొమాన్స్ ఉంటుందో, అలాంటి రొమాన్స్ ఈ షోలో మనం చూడొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 11:50 AM IST

    Bigg Boss Telugu 18

    Follow us on

    Bigg Boss 18: ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందించే క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్త పద్దతులను అనుసరిస్తూ వస్తున్నారు. మన తెలుగు బిగ్ బాస్ షోలో అవి క్లిక్ అయ్యాయి. సీజన్ 6 వరకు మన తెలుగు బిగ్ బాస్ షో రొటీన్ కాన్సెప్ట్ తోనే కొనసాగింది. సీజన్ 6 ఫ్లాప్ అవ్వడంతో ఇక నుండి కొత్తగా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశ్యంతో సీజన్ 7 లో ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ ని పరిచయం చేసారు. క్యాప్షన్ కి తగ్గట్టుగా సీజన్ కూడా ఉండడంతో పెద్ద హిట్ అయ్యింది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 8 కి కూడా ‘అన్ లిమిటెడ్’ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసారు. అది కూడా క్లిక్ అయ్యింది, ప్రస్తుతం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీలతో ఈ సీజన్ మంచి ఊపు మీద కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే హిందీ బిగ్ బాస్ షో నిర్వాహకులు మనకంటే ఎప్పుడు ఒక పది అడుగులు ముందు ఉంటారు.

    మన దగ్గర కంటెస్టెంట్స్ మధ్య కాస్త రొమాన్స్ ఉన్న తట్టుకోలేము, వెంటనే ఆ కంటెస్టెంట్స్ ని బయటకి పంపేందుకు ప్రయత్నం చేస్తాము. కానీ హిందీ బిగ్ బాస్ లో అలా ఉండదు, ఇక్కడ రొమాన్స్ కూడా హద్దులు దాటి ఉంటుంది. అడల్ట్ సినిమాల్లో ఎలాంటి బోల్డ్ రొమాన్స్ ఉంటుందో, అలాంటి రొమాన్స్ ఈ షోలో మనం చూడొచ్చు. అలాగే గొడవలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి, బయట విడిపోయిన జంటలను హౌస్ లోకి తీసుకొని రావడం, వాళ్ళ మధ్య జరిగే గొడవలు చూపించడం, ఇలా హిందీ బిగ్ బాస్ లో ప్రతీ ఒకటి ఓవర్ గానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటి వరకు 17 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే 18 వ సీజన్ ని ఈ ఆదివారం ప్రారంభించుకుంది. హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఆ 19 వ కంటెస్టెంట్ ఎవరో తెలుసా, గాడిద.

    అవును మీరు వింటున్నది నిజమే, హౌస్ లోకి 19 వ కంటెస్టెంట్ గా గాడిదని పంపాడు సల్మాన్ ఖాన్. ఇది మరీ దారుణంగా ఉంది కదూ. ఆ గాడిదని హౌస్ లో మేపే బాధ్యత కంటెస్టెంట్స్ దే. దీనిపై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. అంతే కాదు హౌస్ లో గాడిదను ఉంచడం పై ‘పెటా ఇండియా’ వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఈమేరకు సల్మాన్ ఖాన్ కి బుధవారం రోజు లేఖను పంపారు. ఆ లేఖలో ‘మీ స్థాయిని, హోదాని ఉపయోగించి దయచేసి బిగ్ బాస్ హౌస్ నుండి గాడిదని తొలగించండి. దానిని మాకు అప్పగించండి’ అని రాసి ఉందట. మరి దీనికి సల్మాన్ ఖాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ గాడిద అంశం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.