Indian Film Industry: ఇండియన్‌ సినిమా డామినేషన్‌.. హాలీవుడ్‌తో పోటీ..!

Indian Film Industry: ప్రజలను ప్రభావితం చేసే అంశాల్లో సినిమా అత్యంత ప్రభావవంతమైన మీడియా. సినిమా వార్తలు, నటీ నటులకు సంబంధించిన వార్తలు, కథనాలు చదివే వారు చాలా మంది ఉంటారు. ఇండియాలో సినిమా ప్రభావం ప్రపంచదేశాలతో పోలిస్తే ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తోంది. లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో హాలీవుడ్‌ సినిమాలకు పోటీ ఇస్తోంది. అయితే సినిమా హీరోలు, హీరోయిన్లు, మా ఎన్నికలు, కాంట్రవర్సీలు వచ్చినప్పుడు మాత్రమే […]

Written By: Sekhar Katiki, Updated On : August 21, 2022 1:01 pm
Follow us on

Indian Film Industry: ప్రజలను ప్రభావితం చేసే అంశాల్లో సినిమా అత్యంత ప్రభావవంతమైన మీడియా. సినిమా వార్తలు, నటీ నటులకు సంబంధించిన వార్తలు, కథనాలు చదివే వారు చాలా మంది ఉంటారు. ఇండియాలో సినిమా ప్రభావం ప్రపంచదేశాలతో పోలిస్తే ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తోంది. లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో హాలీవుడ్‌ సినిమాలకు పోటీ ఇస్తోంది. అయితే సినిమా హీరోలు, హీరోయిన్లు, మా ఎన్నికలు, కాంట్రవర్సీలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయి న్యూస్‌ చానెళ్లు. కానీ ఇండియన్‌ ఎకానమీలో సినిమా భాగస్వామ్యం గురించి ఎప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు ఇటుప్రింట్‌ మీడియా, అటు ఎలక్ట్రానిక్‌ మీడియా చేయలేదు.. చేయడం లేదు.

Indian Film Industry

-అంత్యత శక్తివంతంగా ఇండియన్‌ సినిమా..
ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ అత్యంత శక్తివంతమైంది. మన సినిమాలు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు చూస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాలే ఎక్కువ మంది చూస్తారనేది అపోహ మాత్రమే. అయితే గ్లోబల్‌ కల్చర్, గ్లోబల్‌ థింకింగ్, గ్లోబల్‌ బిహేవియర్, వరల్ల్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌పైన హాలవుడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇండియన్‌ సినిమా గ్లోబల్‌ ఎఫెక్ట్‌ లేకపోయినా దాని సాఫ్ట్‌ పవర్‌ శక్తివంతమైంది. దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎవరూ ఆలోచన కూడా చేయడం లేదు.

Also Read: Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?

-మనకు లోకల్‌ ఫిలిం ఇండస్ట్రీ
ప్రపంచంలో లోకల్‌ ఫిలిం ఇండస్ట్రీ ఉన్న దేశాలు చాలా తక్కువ. చైనాలో ప్రపంచంలో అత్యధిక సినిమా థియేటర్లు ఉన్నాయి. కానీ లోకల్‌ ఇండస్ట్రీ తక్కువ. హాలీవుడ్‌ సినిమాల ప్రభావమే చైనాలో ఎక్కువ. ఇండియన్‌ సినిమాలు కూడా చైనాలో ఎక్కువగా ప్రదర్శిస్తారు. బాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చైనాలో విడుదల చేస్తారు. సౌదీ అరేబియా, యూఏఈ, యూరప్‌లో సొంత ఇండస్ట్రీ తక్కువ. ఇక్కడ హాలీవుడ్‌ సినిమాల ప్రదర్శనలే ఎక్కువ. అయితే ఆయా దేశాల్లో హాలీవుడ్‌ సినిమాల ప్రదర్శనపై నిబంధనలు ఉంటాయి. సొంత ఇండస్ట్రీని కాపాడుకునేందుకు ఇలా రిస్ట్రిక్షన్‌ ఉంటుంది. మన దేశంలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఇండియన్‌ సినిమాపై హాలీవుడ్‌ సినిమాలకు ఆదరణ తక్కువే. ఇండియన్‌ సినిమాలనే భారతీయులు ఎక్కువగా చూస్తాయి. భారతీయ సినిమాల 90 శాతం మంది చూస్తే, 10 శాతం మాత్రమే హాలీవుడ్‌ ప్రభావం ఉంది. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్‌ లేకుండా హాలీవుడ్‌ సినిమాలు విడుదల చేసే అవకాశం ఉన్నా.. ఇండియన్‌ సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గదు.

-ప్రపంచంపైనా ప్రభావం..
ఇండియన్‌ సినిమా మార్కెట్‌ ప్రపంచంపైనా ప్రభావం చూపుతోంది. మన దంగల్, లగాన్, త్రీ ఇడియట్స్, తెలుగు సినిమాలకు సబంధించి బాహుబలి 1, 2, ట్రిపుల్‌ ఆర్, పుష్ప లాంటి సినిమాలు భారీగా రెవెన్యూ సంపాదించాయి. దంగల్‌ సినిమా రూ.2,200 కోట్ల ఆదాయం ప్రపంచ వ్యాప్తంగా రావడం ప్రపంచ మార్కెట్లలో ఇండియన్‌ సినిమాకు ఉన్న ఆదరణను తెలియజేస్తుంది.

-భారీగా ఇండియన్‌ సినిమా మార్కెట్‌..
సినిమా అంటే థియేటర్లలో చూసేవే కావు, ఓటీటీ, టీవీలలో కూడా చాలామంది ఇండియన్‌ సినిమాలు చూస్తారు. ఓటీటీ 30 శాతం, టీవీల్లో 25 శాతం సినిమా చూస్తారని ఒక అంచనా. థియేటర్లలో 60 శాతం సినిమా చూస్తారు. ఇండియన్‌ సినిమాలతోపాటు సినిమా లింక్‌ కార్యక్రమాలకు కూడా వ్యూవర్‌షిప్‌కు ఎక్కువ. 2019 లెక్కల ప్రకారం.. రూ.19,100 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. అంటే పన్ను రూపంలో ఇండియన్‌ ఎకానమీకి కూడా భారీగా ఆదాయం వస్తోంది.

Indian Film Industry

-25 లక్షల మందికి ఉపాధి..
సినిమా ఇండస్ట్రీ ద్వారా 25 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ, బాలీవుడ్‌ అన్ని ఇండస్ట్రీలలో కలిపి లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరే కాకుండా రవాణా, హోటళ్లు, ఓటీటీలు, వెబ్‌ చానెళ్లు, న్యూస్‌ చానెళ్లు, సినిమా థియేటర్లు ఇతర మార్గాల ద్వారా మరింతమందికి ఉపాధి లభిస్తుంది. వాటి ద్వారా పన్నుల రూపంలోనూ భారత ఆర్థిక రంగానికి ఆదాయం సమకూరుతోంది. భారతీయ సినిమా హాలీవుడ్‌ను తట్టుకుని నిలబడడమే కాకుండా మన సంస్కృతి సంపప్రదాయాలను ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తోంది. అదే సమయంలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. ఇలాంటి ఇండస్ట్రీపై ఎప్పుడూ నెగెటివ్‌ ప్రచారం కాకుండా, మన క్రియేటివిటీ, సొసైటీపై వాటి ప్రభావం, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల అంశాలను కూడా తెలియజేవాల్సిన బాధ్యత ఇండియన్‌ ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాపై ఉంది.

Also Read:Bimbisara Collections: బింబిసార’ 17 రోజుల కలెక్షన్స్.. సంబరాల్లో నందమూరి అభిమానులు.. ఇంతకీ ఎన్ని కోట్లు లాభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

 

 

Tags