Upasana: మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ మంచి వ్యాపారవేత్త. ఆమె వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంది. అంత బిజీలో కూడా ఆమె తన సెంటిమెంట్స్ ను మాత్రం వదలడం లేదు. ఉపాసనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. తనకు సంబంధించిన ఏ శుభకార్యం జరిపినా ట్రాన్స్ జెండర్ లను ఇంటికి పిలిచి, వారికీ తనదైన ఆదిత్యం ఇస్తోంది.

ప్రతి ఏడాది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని తన ఇంటికి పిలిపించుకున్నట్లే ఈ ఏడాది కూడా ఉపాసన, ట్రాన్స్ జెండర్ లను తన ఇంటికి పిలిపించుకుంది. పైగా వారికి చీర, సారె పెట్టి వారి ఆశీర్వాదం కూడా తీసుకుంది. పైగా ఆ ఫోటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఉపాసనకి ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అంటే ఎంతో ప్రేమ అని ఒకరు, ట్రాన్స్ జెండర్స్ పై ఎందుకు ఉపాసన గారికి అంత ఇంట్రెస్ట్ అని మరొకరు, పూజలు జరిగితే స్వామీజీలు ఆశీర్వాదం తీసుకుంటారు, కానీ ఉపాసన గారు మాత్రం ట్రాన్స్ జెండర్స్ నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు, అదే ఆమె ప్రత్యేకత అంటూ ఇంకొకరు ఇలా చాలా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: తమన్ మోత ఇక ఇప్పట్లో ఆగదు !
సరే, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ విషయాన్ని పక్కన పెడితే.. ఉపాసన ఎప్పుడు తల్లి కాబోతున్నారు అంటూ నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ అడుగుతున్న ప్రశ్న మాత్రం బాగా వైరల్ అవుతుంది. మరి ఈ ప్రశ్నకు ఇప్పటికైనా ఉపాసన నుంచి సరైన సమాధానం వస్తోందా ? చూడాలి.
ప్రస్తుతం ఉపాసన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా, తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ సామాన్యులకు హెల్త్ టిప్స్ చెబుతూ ముందుకెళ్తుంది. ఉపాసన హెల్త్ వరకే పరిమితం అవ్వలేదు, మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిస్తూ కోడలి పాత్రను కూడా సమర్థవంతంగా పోషిస్తోంది.
Also Read: వేరే ఆడవాళ్ళలో లేనివి నాలో ఏమైనా ఉన్నాయా ?