https://oktelugu.com/

దడపుట్టించిన ‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్.. అదరగొట్టిన అక్షయ్..!

దక్షిణాదిలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘ముని-2’.. ‘కాంచన’ చిత్రం బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’గా రీమేక్ అవుతోంది. ఈ మూవీలో హీరో నటించిన రాఘవ లారెన్స్ హిందీలో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా కియరా అడ్వాణీ హీరోయిన్ నటిస్తోంది. Also Read: ఆ ఛానల్ అంతు చూసేందుకు రెడీ అవుతున్న రియా చక్రవర్తి? తాజాగా ‘లక్ష్మీబాంబ్’ మూవీ ట్రైలర్ రిలీజైంది. 3.40 సెకన్ల నడివితో విడుదలైన ఈ ట్రైలర్ ఫస్టు నుంచి చివరిదాకా ఆద్యంతం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 04:05 PM IST
    Follow us on

    దక్షిణాదిలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘ముని-2’.. ‘కాంచన’ చిత్రం బాలీవుడ్లో ‘లక్ష్మీబాంబ్’గా రీమేక్ అవుతోంది. ఈ మూవీలో హీరో నటించిన రాఘవ లారెన్స్ హిందీలో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా కియరా అడ్వాణీ హీరోయిన్ నటిస్తోంది.

    Also Read: ఆ ఛానల్ అంతు చూసేందుకు రెడీ అవుతున్న రియా చక్రవర్తి?

    తాజాగా ‘లక్ష్మీబాంబ్’ మూవీ ట్రైలర్ రిలీజైంది. 3.40 సెకన్ల నడివితో విడుదలైన ఈ ట్రైలర్ ఫస్టు నుంచి చివరిదాకా ఆద్యంతం ఆకట్టుకుంది. హర్రర్ కామెడీగా ‘లక్ష్మీబాంబ్’ను రాఘవ లారెన్స్ తీర్చదిద్దాడు. ఈ ట్రైలర్లోని కొన్ని సీన్లు చూస్తుంటే ప్రేక్షకులకు దడపుట్టడం ఖాయం. అంతా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    ఇక అక్షయ్ కుమార్ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలువడం ఖాయంగా కన్పిస్తోంది. ‘లక్ష్మీబాంబ్’తో అక్షయ్ కుమార్ మరోసాటి తన నటవిశ్వరూపం చూపించాడు. ‘దెయ్యాలు.. భూతాలనేవి లేవు..’ అనే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ‘నిజంగా నేను దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా..’ అంటూ అక్షయ్ కోపంతో అంటాడు.. ఆ తర్వాత ఓ షాపింగ్ మాల్ లో ఎరుపు చీర కట్టుకొని నేను ఎలా ఉన్నానో చెప్పండి అంటూ అక్కడున్న వారిని ఆడగటం హైలెట్ గా నిలిచింది.

    ఈ ట్రైలర్లో కొన్ని చూపించిన కొన్ని కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక హీరోయిన్ కియారా అడ్వాణీ గ్లామర్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేలా కన్పిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రాఘవ లారెన్స్ బాలీవుడ్ నెటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు కన్పిస్తోంది.

    Also Read: గంగవ్వను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్లు.. గేమ్ రసవత్తరంగా మారనుందా?

    ఇక ఈ సినిమా నవంబర్ 9న ఓటీటీలో విడుదల కానున్నట్లు ట్రైలర్లో చూపించారు. మొత్తానికి ‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్ అభిమానులకు ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

    ట్రైలర్ ఇదే..