https://oktelugu.com/

Rashmi Gautam : రష్మీకి సొంతూరిలో అంత ఆస్తి ఉందా.? 100 ఎకరాల పొలంతో పాటు భారీగా కూడబెట్టిన జబర్దస్త్ యాంకర్!

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. రష్మీకి సొంత ఊరిలో వంద ఎకరాల పొలం ఉందట. ఈ విషయంపై రష్మీ గౌతమ్ నేరుగా స్పష్టత ఇచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 19, 2024 / 07:45 PM IST

    Rashmi Goutham

    Follow us on

    Rashmi Gautam : రష్మీ గౌతమ్ బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరు. దశాబ్దకాలంగా ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా బాగానే వెనకేసిందట. ఆమె కోట్లు సంపాదించినట్లు తెలుస్తుంది. రష్మీకి సొంత ఊరిలో వంద ఎకరాల ఆస్తి ఉందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో రష్మీ స్పందించింది. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ ఫేమ్ రాబట్టింది. తన చలాకి తనం, ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనువిందు చేస్తూ గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్ తో రష్మీ లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయింది. అప్పట్లో రష్మీ – సుధీర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. స్టేజి మీద ఒకరికొరకు ప్రపోజ్ చేసుకోవడం, రొమాంటిక్ డాన్సులు, లవ్ స్కిట్స్ తో ట్రెండ్ సృష్టించారు.

    రష్మీ – సుధీర్ మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అని ప్రేక్షకులు భావించేవారు. అదంతా కేవలం స్కిట్ లో భాగమే అని వారి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఫ్యాన్స్ వాళ్ళు లవ్ లో ఉన్నారని భావిస్తున్నారు. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోవాలి అని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతుంటారు. వాస్తవానికి రష్మీ నటిగా రాణించాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. కానీ బ్రేక్ రాలేదు.

    జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ దక్కాక రష్మీకి సినిమాల్లో అవకాశాలు లభించాయి. హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో రష్మీ బాగానే సంపాదించిందట. కోట్లు కూడబెట్టిందట. రష్మీ సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అక్కడ ఆమెకు వంద ఎకరాల పొలం ఉందట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం పై రష్మీ స్పందించింది.

    తాజాగా ఓ చిట్ చాట్ ప్రోగ్రాం లో రష్మీ పాల్గొంది. ఈ క్రమంలో మీకు సొంత ఊరిలో వంద ఎకరాల పొలం ఉందట? అని యాంకర్ ప్రశ్నించారు. మాకు పొలం ఉన్న మాట వాస్తవమే. మా అమ్మ వాళ్ళ తరుపున కొంత భూమి ఉంది. కానీ వంద ఎకరాలు మాత్రం లేదు. ఇలాంటి ప్రచారం చేసి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసేలా చేయకండి అని ఫన్నీగా బదులిచ్చింది. రష్మీకి ఒక నిర్మాత లగ్జరీ విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

    యూట్యూబ్ ఛానల్ కథనాల పై రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఉన్న ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలన్స్ ఎవరో ఇచ్చినవి కాదు. తన కష్టార్జితంతో సంపాదించుకున్నవి అని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ ఈటీవీలో పలు షోలు చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా రష్మీ హవా నడుస్తోంది. 36 ఏళ్ల రష్మీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకు సమయం ఉందని దాట వేస్తుంది. మరోవైపు సుధీర్ కి కూడా పెళ్లి కాలేదు. అందుకే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని నమ్మేవారు లేకపోలేదు.