CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా.. తెలంగాణ ఓటర్లు చాలాకాలం ఆ పార్టీకి అధికారం ఇవ్వలేదు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌అలియాస్ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కేసీఆర్‌ను సీఎం చేశారు. అయితే పదేళ్లలో బీఆర్‌ఎస్ అనేక అభివృద్ధి పనులు చేయడంతోపాటు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైంది. ఉద్యమకారులను పట్టించుకోకపోవడంతో, ఉద్యోగ నియామకాలను నిర్లక్ష్యం చేశారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌లో చోటా మోటా నాయకుల నుంచి బడయా నాయకుల వరకు అరాచకాలు పెరిగాయి. దీంతో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. ఇదే సమయంలో 2024 రావడం, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీ స్కీంలు ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజలు హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే పూర్తిగా అమలు కావడం లేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలు కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న ఓ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
హామీల అమలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్. అందిస్తోంది. పంట రుణమాఫీ అమలు చేసింది. అయితే చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. దీనిపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి తరణంలో గత ప్రభుత్వం తెచ్చిన ఓ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈమేరకు ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ అమలుకు అవసరమైతే ఓ పథకాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు. అన్ని సబ్సిడీ పథకాలు పునరుద్ధరిస్తామన్నారు. దీంతో ప్రభుత్వం ఏ పథకం ఆపివేస్తుంది అన్న చర్చ మొదలైంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఆపివేసే ఆలోచన లేదు. దీంతో ప్రభుత్వానికి మిగిలేది రూ.500 కోట్లే. ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్ కూడా భారీగా మిగిల్చేవి కావు.
ఆ భారీ స్కీం నిలిపివేత?
రూ.2 లక్షల రుణమాఫీ కావాలంటే రూ.32 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెప్పింది. కానీ ఆగస్టు 15 నాటికి మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. దీంతో చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో అర్హులందరి రుణాలు మాఫీ చేసేందుకు నిధుల సమీకరణపై సర్కార్ దృష్టిపెట్టింది. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పూర్తి రుణమాఫీ చేయకుంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అమలు చేసిన చాలా స్కీంలన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కేసీఆర్ కిట్టు, విద్యార్థినులకు అందించే కిట్లు, బతుకమ్మ చీరలు, రైతుభరోసా ఆగిపోయాయి. ఈ తరుణంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ భారీ స్కీంను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.