Nannaku Prematho: సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. స్టార్ హీరోతో ఇలాంటి సినిమా కూడా తీయొచ్చా అని అందరూ అవాక్కయ్యేలా సుకుమార్ ఈ సినిమాని తీసి సక్సెస్ చేయడం అనేది ఆయన టాలెంట్ కి నిదర్శనం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాని తీస్తున్న సమయంలో ఎన్టీఆర్ కి ‘బటర్ ఫ్లై ‘ ఎఫెక్ట్ గురించి పెద్దగా అవగాహన లేదట, దాంతో ఈ సినిమాని సుకుమార్ ఎలా తీస్తున్నాడు, ఏంటి అనే విషయాల మీద తను కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
ముఖ్యంగా సుకుమార్ తనకు చెప్పిన కథను తెరకెక్కిస్తున్నాడా లేదంటే, కొన్ని సీన్లను మార్చి సినిమా చేస్తున్నాడా అనే విషయం మీద ఎన్టీఆర్ కి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆయన మాటిమాటికి సుకుమార్ తో సినిమా ఎలా వస్తుంది. ఓకేనా అంటూ అడుగుతూ ఉండేవాడట, దాంతో సుకుమార్ కూడా ఆ సినిమా అప్డేట్ ని ఎన్టీఆర్ కి తెలియజేస్తూ ఉండేవాడట. అలాగే ఈ సినిమాను తెరకెక్కించడంలో సుక్కు స్పెషల్ కేర్ తీసుకున్నాడట. ఎందుకంటే ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ టెంపర్ తో చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.
అలాగే సుకుమార్ కి వన్ నేనొక్కడితో భారీ ఫ్లాప్ అయితే పడింది. కాబట్టి ఈ సినిమాతో ఇద్దరూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలో ఇద్దరు కూడా ఆచితూచి ముందుకు కదిలినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సుకుమార్ ఈ సినిమాతో ఎన్టీఆర్ కు ఒక భారీ సక్సెస్ ని అందించాడనే చెప్పాలి.
ఇక దీనికి ముందు వన్ మూవీ సమయం లో తను మహేష్ బాబుని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని, స్టార్ హీరోలని హ్యాండిల్ చేయడం సుకుమార్ కి రాదని చాలా మంది విమర్శించారు. కాబట్టి ఈ సినిమా ద్వారా తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశ్యం తోనే కసి తో ఈ సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకొని అందరి నోర్లు మూయించాడు…