Vikramarkudu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ఒక సినిమాని సూపర్ సక్సెస్ గా మార్చడంలో రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాల్లో కెల్లా ఆయనకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి.
ఈ సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. దాంతో రవితేజ ను హీరోగా పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. అలాగే ఈ సినిమాను ఆరు భాషల్లో రీమేక్ చేస్తే ఆరు భాషల్లో కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం నిజంగా ఈ సినిమాకి ఉన్న దమ్ము ఏంటో దేశవ్యాప్తంగా తెలియజేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒకటి విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర కాగా, రెండోవది అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్.
అయితే సత్తిబాబు క్యారెక్టర్ కామెడీగా ఉండడంతో ఈ సినిమాలో రవితేజ చాలా కామెడీ ని కూడా పండించాడు. ఇక ఈ సినిమా ఇంట్రడక్షన్ లో వచ్చే అరగుండు సీన్ కి బదులుగా ముందుగా వేరే సీన్ ను అనుకున్నారట, కానీ అది అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవడంతో, రవితేజతో అరగుండు సీన్ గురించి రాజమౌళి డిస్కస్ చేశాడు.
దానికి రవితేజ కూడా బాగా నవ్వుకొని ఈ సీన్ బాగుంది థియేటర్ లో రెస్పాన్స్ భారీగా వస్తుంది అంటూ రవితేజ చెప్పడంతో ఈ సీన్ ని సినిమాలో ఆడ్ చేశాడట. ఇక ఈ సినిమా మొత్తంలో ఆ సీన్ హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ‘విక్రమార్కుడు ‘ తో అటు రవితేజ , ఇటు రాజమౌళి ఇద్దరు ఒక భారీ సక్సెస్ అయితే కొట్టారు…