Nagababu: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతోంది… ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన మెగా స్టార్ గా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ‘టార్చ్ బేరర్’ గా మారాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీని రెండు భాగాలుగా విభజిస్తే అది చిరంజీవి రాకముందు చిరంజీవి వచ్చిన తర్వాత అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి వచ్చిన తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది. డ్యాన్స్ లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. ఇక తన ఇన్స్పిరేషన్ తోనే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి పవర్ స్టార్ గా మారిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ బ్రదర్స్ ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ శాసిస్తున్నారు. నిజానికి చిరంజీవి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ అన్నగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగబాబు సైతం సినిమాల్లో అడపాదడపా క్యారెక్టర్ లను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ప్రొడ్యూసర్ గా సైతం పలు సినిమాలను నిర్మించి సినిమాల మీద తనకున్న టేస్ట్ ఏంటో అందరికీ తెలియజేశాడు.ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని జీడిమెట్ల అనే ఏరియాలో ఫార్మ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాడు. దాంతో నాగబాబు అక్కడ 20 ఎకరాల ల్యాండ్ లీజుకు తీసుకొని చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక ఇదంతా 2004వ సంవత్సరంలో చేయడం విశేషం…మొదట అక్కడొక రక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడానికి వెళ్లిన నాగబాబు అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అక్కడ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే స్మెల్ ఎలా ఉంటుందో తెలుసుకున్న ఆయన ఫ్యూచర్ లో ఇక్కడ జనాలు బతకడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఎలాగైనా సరే వాళ్లకు మంచి చేయాలని ల్యాండ్ లో సొంతంగా తన 50 లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకుని మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడట..
ఇక దాన్ని చూసుకోవడానికి కొంతమంది వర్కర్లను నియమించి వాళ్ళకి సైతం తను సొంతంగా జీతాలు ఇస్తూ వస్తున్నాడట. మొత్తానికైతే అప్పుడు ఆయన పెట్టిన మొక్కలు ఇప్పుడు ఆ ఏరియా లో ఒక చిన్నపాటి అడవిగా తయారయ్యాయి.
దానివల్ల కంపెనీ నుంచి వచ్చే కార్బన్ డై యాక్సైడ్ ను చెట్లు పీల్చుకొని జనాలకు ఆక్సిజన్ వదులుతున్నాయని అప్పుడు ఆయన చేసిన కార్యక్రమం పట్ల అక్కడి ప్రజలు చాలా గొప్పగా చెబుతున్నారు. అందుకే వాళ్ళందరూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల కంటే కూడా మాకు నాగబాబు అంటే ఇష్టమని ఆయనకు మేము డై హార్ట్ ఫ్యాన్స్ అంటూ చెబుతుండడం విశేషం…
నిజానికి నాగబాబు ఒకానొక సమయంలో ‘ఆరెంజ్’ మూవీ ప్లాప్ అయినప్పుడు తను భారీగా నష్టపోయాడు. ఆ సమయంలో కూడా మొక్కల దగ్గర పనిచేసే వర్కర్స్ కి జీతాలు ఇస్తూ వాళ్ళను మెయింటైన్ చేస్తూ వచ్చాడు… 2004 వ సంవత్సరంలోనే 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో ఆయనకి సిటీ ఔట్ కట్స్ లో 50 ఎకరాల భూమి వచ్చేది.
ఇప్పుడు సిటీ ఔట్ కట్స్ లో ఒక్కో ఎకరం 10 కోట్ల విలువ చేస్తున్నాయి… అంటే అప్పుడు ఆయన ల్యాండ్ తీసుకొని ఉంటే ఆయనకి ఇప్పుడొక 500 కోట్ల రూపాయలు వచ్చేవి…కానీ ఆయన అప్పుడు ఆయన జనాల గురించి ఆలోచించాడు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు…ఇక ఇదంతా తెలుసుకున్న చాలా మంది జనాలు నాగబాబు వ్యక్తిత్వం గురించి చాలా గొప్ప గా మాట్లాడుకుంటున్నారు…