Jr NTR industry hit: ఎవరైనా సరే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలంటే వరుస సక్సెస్ లను సాధించాలి. ఇక వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా ఇండస్ట్రీ హిట్ ని సాధిస్తే వాళ్ళు టైర్ వన్ హీరోగా మారిపోతారు. ఇక ఇప్పుడు టైర్ వన్ హీరోగా కొనసాగుతున్న వాళ్ళలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కి తప్ప మిగిలిన హీరోలందరు ఇండస్ట్రీ హిట్ కొట్టిన వాళ్లే కావడం విశేషం… ఎన్టీఆర్ ఏ సినిమా చేసిన కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతోంది. తప్ప అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కావడం లేదు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆది, సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించినప్పటికి అవి ఇండస్ట్రీ హిట్ గా మాత్రం మారలేదు.
తద్వారా జూనియర్ ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా దక్కించుకోలేదు. మిగతా హీరోలందరు వాళ్ళ కెరియర్ లో ఒకటి నుంచి రెండు ఇండస్ట్రీ హిట్స్ ను నమోదు చేసుకోగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ ఫీట్ ని అందుకోలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ సినిమా ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేస్తుందని చాలామంది అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయినప్పటికి ఆ సినిమా అనుకున్నట్టుగా రావడం లేదని ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి.
దాంతో ఈ సినిమా మీద ఇప్పటిదాకా ఉన్న అంచనాలన్నీ ఒకసారి తారుమారైపోయాయి ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయినప్పటికి ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే ఘనత సాధ్యమవుతుందని భావించారు. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తనకి భారీ సక్సెస్ ని అందిస్తాడని అనుకున్నప్పటికి ఆయన ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అనే కల కలగానే మిగిలిపోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…