Chiranjeevi Mythological Stories: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి. తెలుగులో ఆయనను మించిన నటులు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా ఆయన పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు. గతంలో సైరా (Syra) సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసిన ఆయన ఆలీ మూవీ తో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు ‘ విశ్వంభర’ (Vishwambhara) సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాటపడుతున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి దానికి అనుగుణంగానే వశిష్ట (Vashishta) డైరెక్షన్ లో చేస్తున్న విశ్వంభర సినిమాతో కూడా భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సీజీ వర్క్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని నిదానంగా వచ్చే సంవత్సరం థియేటర్లోకి రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…
Also Read: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. మన రవీంద్ర జడేజా కు లార్డ్సే కాదు..మనమూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే!
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరియర్ లో ఎన్ని రకాల పాత్రలను పోషించినప్పటికి ఒక పాత్ర మాత్రం అతనికి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. పౌరాణిక పాత్రలు ఆయనకు పెద్దగా కలిసేది రాలేదు. ముఖ్యంగా శివుడి పాత్ర చేసిన ప్రతి సారి చిరంజీవికి ఆశించిన మేరకు విజయాలైతే దక్కలేదు. ‘శ్రీ మంజునాథ’ (Sri Manjunatha) సినిమాలో శివుడి గా కనిపించి మెప్పించిన ఆయన ఆ సినిమాతో సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు.
అలాగే ‘ఆపద్బాంధవుడు’ (Apadbhandavudu) సినిమాలో నాటకం వేసినప్పుడు శివుడి పాత్రలో కనిపిస్తాడు. ఇక ఆ సినిమా కూడా అతనికి సక్సెస్ ను అయితే కట్టబెట్టలేదు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి చేస్తున్న పాత్ర అతనికి ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టింది. శివుడి పాత్రతో ఆయన ఏ మాత్రం మెప్పించకపోగా భారీగా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.
అందువల్ల మరోసారి అలాంటి పాత్రను ట్రై చేయలేదనే చెప్పాలి… ఇక సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆయన రేంజ్ లో చిరంజీవి ఒక్క పౌరాణిక పాత్రను కూడా చేసి సక్సెస్ ఫుల్ గా నిలుపలేకపోయాడు. కాబట్టి ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్ని సక్సెస్ లను సాధించిన ఇదొక్కటి మాత్రం తీరని లోటుగా మిగిలిపోయిందనే చెప్పాలి…