Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby movie: చిరంజీవి డైరెక్టర్ బాబీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?

Chiranjeevi Bobby movie: చిరంజీవి డైరెక్టర్ బాబీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?

Chiranjeevi Bobby movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంది. కమర్షియల్ సినిమాని రొటీన్ ఫార్మాట్లో చేస్తే సక్సెస్ అవ్వదు. దానికి సపరేట్ ట్రాక్ ని ఎంచుకొని ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. అందుకే కమర్షియల్ సినిమాల్లో ఎంత సక్సెస్ అయితే వస్తుందో అన్ని డిజాస్టర్లు కూడా దక్కుతూ ఉంటాయి. దీని వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తే తప్ప కమర్షియల్ సినిమాలు అడవనే విషయమైతే చాలామంది దర్శకుల విషయంలో ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి తో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడిగా బాబీ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇంతకుముందు బాలయ్య బాబుతో చేసిన ‘డాకు మహారాజ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవితో మరోసారి జత కడుతున్నాడు. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కింది.

ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దాంతో బాబీకి మరో అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే స్క్రిప్ట్ విషయంలో బాబీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాబీ చిరంజీవితో పాటు అందరిని కన్విన్స్ చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది చిరంజీవి బ్లైండ్ గా బాబీ ని నమ్మేస్తున్నాడా? అనే అనుమాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒక సక్సెస్ ఇచ్చాడనే కాన్ఫిడెంట్ తో బాబీ ని ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాడా? నిజంగానే బాబీ మరో సక్సెస్ ని తీస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చిరంజీవి బాలయ్య లాంటి హీరోలకు మంచి సక్సెస్ లను అందించిన దర్శకుడిగా బాబీ గొప్ప గుర్తింపునైతే పొందాడు. ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular