https://oktelugu.com/

Samudra Khani : 3000 ఎపిసోడ్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ పాపులర్ సీరియల్ కి సముద్ర ఖని దర్శకుడు అనే విషయం ఎవరికైనా తెలుసా..?

'పిన్ని' అనే సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీరియల్స్ రెండు భాగాలుగా వచ్చింది, సుమారుగా 3000 ఎపిసోడ్స్ ఉంటాయి. మొదటి భాగం పేరు 'పిన్ని' కాగా, రెండవ భాగం పేరు 'ఝాన్సీ'. ఇందులో రాధిక ద్విపాత్రాభినయం చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సీరియల్ కి దర్శకత్వం వహించింది సముద్ర ఖని నే అట.ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : July 21, 2023 3:24 pm
    Follow us on

    Samudra Khani : గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్న పేరు సముద్ర ఖని. ఈయన రీసెంట్ గా విడుదలయ్యే ప్రతీ పెద్ద హీరో సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్ గా చేస్తూ వస్తున్నాడు. కాని ఇప్పుడు ట్రెండ్ అవ్వడానికి అది కారణం కాదు, ఆయన చాల కాలం తర్వాత డైరెక్టర్ గా మారి, ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ చిత్రాన్ని తెరకెక్కించాడు.

    ఈ సినిమా మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఈ నేపథ్యం లో, మూవీ యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా గురించి ఎన్నో విశేషాలను పంచుకుంటున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో సాయి ధరమ్ తేజ్ సముద్ర ఖని గురించి మానెవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్నీ చెప్పుకొచ్చాడు.

    అదేమిటంటే సముద్ర ఖని కేవలం సినిమాలకు మాత్రమే కాదు, కొన్ని మెగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించాడు. మన చిన్నతనం లో ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన ‘పిన్ని’ అనే సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీరియల్స్ రెండు భాగాలుగా వచ్చింది, సుమారుగా 3000 ఎపిసోడ్స్ ఉంటాయి.

    మొదటి భాగం పేరు ‘పిన్ని’ కాగా, రెండవ భాగం పేరు ‘ఝాన్సీ’. ఇందులో రాధిక ద్విపాత్రాభినయం చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సీరియల్ కి దర్శకత్వం వహించింది సముద్ర ఖని నే అట.ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. తెలుగు సముద్ర ఖని అంతకు ముందు రవితేజ, అల్లరి నరేష్ కాంబినేషన్ లో ‘శంభో శివ శంభో’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా , మంచి చిత్రం గా పేరు తెచ్చుకుంది.