https://oktelugu.com/

Guess Actress: అక్కడున్న టాటూ చూపిస్తున్న టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?

సోషల్ మీడియా స్టార్ హోదాలో బిగ్ బాస్ తెలుగు 2లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. హౌస్లో దీప్తి తన గేమ్ తో ఆకట్టుకుంది. ఆమె డ్రెస్సింగ్ కూడా హైలెట్ అయ్యింది. సీజన్ 2 లో గీతా మాధురి, కౌశల్, శ్యామల, తేజస్వి మాదివాడ, కిరీటి, నందిని, భానుశ్రీ వంటి టాప్ సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 5, 2023 / 02:28 PM IST

    Guess Actress

    Follow us on

    Guess Actress: డీప్ నెక్ బ్లౌజ్ లో సూపర్ హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియా సెలబ్రిటీ. మంచి డాన్సర్ కూడాను. బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఇంస్టాగ్రామ్ లో పిచ్చ ఫేమస్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా?… ఈ బోల్డ్ బ్యూటీ ఎవరో కాదు దీప్తి సునైన. ఈమె తెలియని సోషల్ మీడియా జనాలు ఉండరు. దీప్తి సునయన మంచి డాన్సర్, నటి కూడాను. యూట్యూబ్ వేదికగా అనేక సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లు చేసింది. ఆ విధంగా పాపులారిటీ తెచ్చుకుంది.

    సోషల్ మీడియా స్టార్ హోదాలో బిగ్ బాస్ తెలుగు 2లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. హౌస్లో దీప్తి తన గేమ్ తో ఆకట్టుకుంది. ఆమె డ్రెస్సింగ్ కూడా హైలెట్ అయ్యింది. సీజన్ 2 లో గీతా మాధురి, కౌశల్, శ్యామల, తేజస్వి మాదివాడ, కిరీటి, నందిని, భానుశ్రీ వంటి టాప్ సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే దీప్తి సునయనకు పాపులారిటీ తక్కువే. అయినా పది వారాలు హౌస్లో ఉంది.

    బిగ్ బాస్ తెలుగు 2 టైటిల్ కోసం గీతా మాధురి-కౌశల్ పోటీపడ్డారు. అయితే కౌశల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షో దీప్తి కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఆమెకు వీడియోలకు సోషల్ మీడియాలో మరింత ఆదరణ దక్కింది. కాగా దీప్తి సునైన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోయింది. ఐదేళ్లకు పైగా కలిసి ప్రేమించుకున్న ఈ జంట ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు దీప్తి వీడియో విడుదల చేసింది.

    ఆమె కారణాలు మాత్రం చెప్పలేదు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరూ హౌస్లో హద్దులు మీరు ప్రవర్తించారు. ఇదంతా బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యింది. దాంతో షణ్ముఖ్ నుండి విడిపోవాలని డిసైడ్ అయ్యింది. దీప్తి, షణ్ముఖ్ కి బ్రేకప్ అయ్యి రెండేళ్లు అవుతుంది. మరలా కలవలేదు. ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా ఉన్నారు.