Uppal Stadium: ఇంకో గంట లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపధ్యం లో అందరి దృష్టంతా మ్యాచ్ మీదనే ఉంది. ఇక దానికి తోడుగా మొదటి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో భారీ ఎత్తున జరుగుతుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బిసిసిఐ మాత్రం హైదరాబాద్ ని చాలా తక్కువ చేసి చూస్తున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ ని అహ్మదాబాద్ లో నిర్వహించారు ఓకె ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇండియా కి సంబందించిన ఒక్క మ్యాచ్ ని కూడా ఇక్కడ ఉప్పల్ గ్రౌండ్ లో నిర్వహించకపోవడం నిజంగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులకి భాదని కలిగించే విషయం అనే చెప్పాలి.
ఇక వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచులన్నింటిని ముంబై, అహ్మదాబాద్,చెన్నై, బెంగుళూరు, కలకత్తా, ఢిల్లీ, పూణే, లక్నో లు వేదికగా నిర్వహిస్తున్నారు కానీ హైదరాబాద్ లో మాత్రం ఒక్కటి అంటే ఒక్క ఇండియా మ్యాచ్ కూడా లేకపోవడం చూస్తుంటే ఇక్కడే హైదరాబాద్ ని తక్కువ చూసి చూస్తున్నట్టు గా చాలా స్పష్టం గా తెలుస్తుంది.హైదరాబాద్ లో పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ అక్టోబర్ 06 వ తేదీన జరుగుతుంది,అలాగే 9 వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్ మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది,అలాగే 12 వ తేదీన పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది…హైదరాబాద్ కి కూడా మ్యాచ్ లు కేటాయించాము కదా అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మ్యాచ్ లని కేటాయించారు తప్పితే హైదరాబాద్ లో మ్యాచ్ లు పెట్టాలని వాళ్ళకి లేదు…
అంటే హైదరాబాద్ అనేది బిసిసిఐ కి అసలు ఎంత మాత్రం ఒక స్టేట్ లాగా కనిపించడం లేదు అనే విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టం గా అర్థం అవుతుంది.ఈ నెల 14 వ తేదీన జరగబోయే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదిక గా జరుగనుంది. ఆ మ్యాచ్ ని ఉప్పల్ లో పెడితే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.పాకిస్థాన్ ఆడే వార్మప్ మ్యాచ్ లకి,చిన్న దేశాల మీద ఆడే మ్యాచ్ లకి ఉప్పల్ స్టేడియం కావాలి కానీ ఇండియా మీద ఆడే మ్యాచ్ కి మాత్రం అవసరం లేదు అంటూ మరికొందరు క్రికెట్ విశేషకులు సైతం ఘాటు గా స్పందిస్తున్నారు. నిజానికి ఈ మూడు మ్యాచ్ లు జరగడానికి బిసిసిఐ ఉప్పల్ స్టేడియానికి అక్కడ వసతుల కోసం, ప్లేయర్లు వస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి, మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆడియన్స్ కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోవడానికి బిసిసిఐ ఉప్పల్ స్టేడియానికి 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది.కానీ మొన్న పాకిస్థాన్ కి, ఆస్ట్రేలియా కి మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ ని చూడటానికి వచ్చిన ప్రేక్షకులు సైతం ఆ స్టేడియం లో ఉన్న చైర్లని చూసి అక్కడున్న చెత్త, చెదారాన్ని చూసి ఇది క్రికెట్ గ్రౌండ్ లేకపోతే మరేదైననా అంటూ ఆ విరిపోయిన ఛైర్లు, పాడైపోయిన ఛైర్లు,చెత్త చెదరాలను చూసిన అభిమానులు వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టి వాటిని ట్రోల్ చేస్తున్నారు.
ఎందుకు ఇలా పట్టింపులు లేకుండా గ్రౌండ్ లను ఉంచుతున్నారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది.ఇక బిసిసిఐ వరల్డ్ కప్ కి ముందే దానికి సంభందించిన మెయింటెన్స్ మొత్తాన్ని చేసుకోవాల్సింది. కానీ ఎందుకు బిసిసిఐ ఇలా పట్టింపులేని చర్యలు చేపడుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు…ఇక వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం హైదరాబాద్ లో మ్యాచులు మొత్తానికే పెట్టకుండా ఉండాల్సింది అంత భాదతో ఎందుకు మ్యాచులు ఇక్కడ నిర్వహించడం అంటూ కొంతమంది చాలా ఘాటు గా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది…ఇక ఇది ఇలా ఉంటె HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 2019 ఎన్నికైన అజారుద్దున్ ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియడం లేదు.ఐపీఎల్ లో వేరే రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యల్లో ప్లేయర్లు వచ్చి మ్యాచులు ఆడుతుంటే హైదరాబాద్ నుంచి మాత్రం ఒకరు, ఇద్దరు మాత్రమే ప్రతి సంవత్సరం ఐపీఎల్ లో డెబ్యూ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఒక తిలక్ వర్మ మాత్రమే హైదరాబాద్ నుంచి ఇండియన్ టీం కి ఆడుతున్న ప్లేయర్ గా ఉన్నాడు.ఢిల్లీ ఉత్తరప్రదేశ్, ముంబై నుంచి చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ లోకి వస్తున్నారు.మరి హైదరాబాద్ లో టాలెంట్ ఉన్న ప్లేయర్లు లేరా అంటే ఉన్నారు కానీ HCA వాళ్ళని గుర్తించడం లేదు అంటూ చాలా మంది HCA మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతకు ముందు చాలా బాగా ఆడిన రాయుడు ని రాజకీయాలు చేసి తొక్కేశారు.ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి టాలెంట్ ఉన్న ఏ ప్లేయర్ కూడా బయటికి రావడం లేదు…ఇలా తయారైంది ప్రస్తుతం హైదరాబాద్ లో క్రికెట్ పరిస్థితి…