Sridevi: లెజెండరీ నటి శ్రీదేవి చేతిలో నవ్వులు చిందిస్తున్న ఈ క్యూట్ బేబీ ఓ పాన్ ఇండియా హీరోయిన్. సౌత్ టు నార్త్ దున్నేస్తుంది. వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టింది. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరు? ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ పాప ఎవరో కాదు… శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఈ స్టార్ కిడ్ సౌత్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది.
ఎన్టీఆర్ కి జంటగా దేవర చిత్రం చేస్తుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. దేవర లో జాన్వీ కపూర్ రోల్ చాలా కీలకంగా ఉంటుందని కొరటాల శివ గతంలో చెప్పాడు. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన దేవర దసరాకు వాయిదా పడింది. అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు కొత్త విడుదల తేదీ ప్రకటించారు.
అలాగే రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 16 చేస్తుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఈ చిత్రం. ప్రో ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కథగా బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్నాడు. ఉత్తరాంధ్రలో సాగే కథగా దర్శకుడు రూపొందించనున్నారు. రామ్ చరణ్ గెటప్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయని సమాచారం.
అలాగే బాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలు చేస్తుంది. కాగా ధడక్ మూవీతో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆమె డెబ్యూ మూవీ విడుదల కాకుండానే శ్రీదేవి కన్ను మూసింది. 2018లో శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ప్రమాదంలో మరణించింది. జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలన్న కల నెరవేరక ముందే శ్రీదేవి ఈ లోకాన్ని వీడి పోయింది. శ్రీదేవి జతకట్టిన సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వారసులతో జాన్వీ కపూర్ చిత్రాలు చేయడం విశేషం…