Photo Story: పైన కనిపిస్తున్న ఫోటో లో స్టైల్ గా కూర్చోయిని ఫోజులు ఇచ్చిన ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా ? ఇతను తోలి సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసాడు, డైరెక్టర్ టెక్నికల్ గా ఇలా కూడా ఆలోచిస్తారా అని అందరూ ఆశ్చర్యపొయ్యే రేంజ్ లో ఆయన కనిపెట్టిన కొన్ని షాట్స్ కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి ఒక పుస్తకం లాంటిది.ఆయనలోని టాలెంట్ ని చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోయింది. అక్కడి బడా నిర్మాతలు కూడా రామ్ గోపాల్ వర్మ కి భారీ గా అడ్వాన్స్ ఇచ్చి తమ సినిమాలకు బుక్ చేసుకున్నారు.
బాలీవుడ్ లో కూడా ఆయన మేనియా కొన్నేళ్ల పాటు నడిచింది. అలా ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత అతని బుర్ర పూర్తిగా చెడిపోయింది. సినిమాల మేకింగ్ మీద ద్రుష్టి తగ్గించేసి, కాంట్రవర్సీ ని తన ఊపిరి గా బ్రతుకు బూతు బొమ్మలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అతను ఎవరో ఈపాటికి మీకు అర్థం అయిపోయి ఉంటాది, అతను మరెవరో కాదు, రామ్ గోపాల్ వర్మ. ఇది ఆయనగారి చిన్నప్పటి ఫోటో అట, నిన్న రాత్రి ట్విట్టర్ లో అప్లోడ్ చేసాడు.
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత మానసిక పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే, అతను సోషల్ మీడియా లో చేస్తున్న వెక్కిలి వేషాలు, తీస్తున్న బూతు సినిమాలు చూస్తే ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ ఈ స్థాయికి వచేసాడే అనే బాధ ప్రతీ ఒక్కరిలో కలగడం సహజం. కానీ అవతల వ్యక్తి ఏమి అనుకున్న పర్వాలేదు, నాకు నచినట్టుగానే నేను ఉంటాను అనే ధోరణి తో ముందుకు వెళ్లే రామ్ గోపాల్ వర్మ , తనకి తాను మేధావి అని అనుకునే భ్రమలో కూడా బ్రతుకుతుంటాడు.
ప్రస్తుతం ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన రెమ్యూనరేషన్ ని తీసుకొని త్వరలోనే వై ఎస్ జగన్ ని మహాత్మా గాంధీజీ లెవెల్ లో చూపించి, పవన్ కళ్యాణ్ మరియు చంద్ర బాబు ని విలన్స్ గా చూపించే ప్రయత్నం లో ‘వ్యూహం’ అనే చిత్రం తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. వివాదాలతో పొట్ట నింపుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో ఇంకెన్ని వివాదాలు సృష్టించబోతున్నాడో చూడాలి.