https://oktelugu.com/

Arya Movie Child Artist: ఆర్య సినిమాలోని ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? చాలా మారిపోయింది గురూ..

రూ. 4 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడడు బన్నీ.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 2, 2024 / 04:24 PM IST

    Do you remember this girl from Arya Movie

    Follow us on

    Arya Movie Child Artist: డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమానే ఆర్య. ఇది దర్శకుడికి మొదటి సినిమా అయితే బన్నీకి మాత్రం రెండో సినిమా. కానీ ఇద్దరికి సూపర్ హిట్ ను అందించింది. డిఫరెంట్ స్టోరీ, కథనం, అల్లు అర్జున్ లుక్స్, యాక్టింగ్, దేవీ శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాకుగాను అల్లు అర్జున్ కు నంది అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో 52 ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకున్నారు సుకుమార్.

    రూ. 4 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడడు బన్నీ. కానీ హీరోయిన్ మాత్రం మరో అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. ఇందులో హీరోకు ఓ తొట్టి గ్యాంగ్ ఉంటుంది. అదేనండి పిల్లల గ్యాంగ్. ఆ పిల్లల గ్యాంగ్ లో పెద్దగా ఉన్న పాప గుర్తుందా. ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ పాప ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. సందడే సందడి, ఔనన్నా కాదన్నా సినిమాల్లో నటించింది.

    కొంత విరామం తీసుకున్న ఈ పాప ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు శ్రావ్య. హ్యాపీడేస్ మూవీ సినిమాలో టైసన్ గుర్తున్నాడా. అతనికి జోడీగా నటించింది. లవ్ యూ బంగారం సినిమాలో నటించిన ఈ అమ్మాయి కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. రోజ్ అనే కన్నడ సినిమాలో నటించింది. తెలుగులో కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్ హోం అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. తమిళంలో కూడా పగిరి, విలయట్టూ ఆరంభం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.

    2018లో వచ్చిన మసకలి లో కనిపించింది శ్రావ్య. అయితే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈమె సోదరి కూడా చైల్డ్ ఆర్టిస్టే. మల్లీశ్వరి సినిమాలో నటించిన చిన్నారి గుర్తుందా. గ్రీష్మ నేత్రికకు శ్వేత స్వయంగా అక్కనే అవుతుందట. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువు పూర్తి చేశారు. కొత్త సినిమాల అప్డేట్ లేకున్నా శ్రావ్య సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతుంటుంది.