https://oktelugu.com/

Arya Film Child Artist : ఆర్య’ చిత్రంలోని ఈ చైల్డ్ ఆర్టిస్టుని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పిల్లల గ్రూప్ లో అద్దాలు పెట్టుకొని ఉన్న ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ఈమె 'లవ్ యు బంగారం' అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రం లో హీరో గా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హరిదాస్ (టైజన్) హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా నటిగా శ్రావ్య కి మంచి మార్కులు పడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 09:18 PM IST

    Arya Film Child Artis Shravya

    Follow us on

    Arya Film Child Artist : కొన్ని సూపర్ హిట్ సినిమాలలో బాలనటులుగా నటిస్తున్న ఎంతో మంది ఆర్టిస్టులు పెద్దయ్యాక ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా, లేదా హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొంతమంది బాలనటులు ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్స్ గా మారిపోయారు. రీసెంట్ గానే తేజ సజ్జ ‘హనుమాన్’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానటువంటి రికార్డ్స్ ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ,తరుణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రాశి వంటి వారు బాలనటులుగా ఇండస్ట్రీ లోకి నేడు స్టార్స్ గా ఎదిగిన వారే. ఆ జాబితాలోకి ఇప్పుడు తేజ సజ్జ కూడా చేరిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఆర్య చిత్రంలో బాలనటిగా నటించిన ఒక అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ‘ఆర్య’ చిత్రంలో అల్లు అర్జున్ ఎక్కువగా పిల్లలతో తిరుగుతూ ఉంటాడు.

    ఆ పిల్లల గ్రూప్ లో అద్దాలు పెట్టుకొని ఉన్న ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ఈమె ‘లవ్ యు బంగారం’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రం లో హీరో గా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హరిదాస్ (టైజన్) హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా నటిగా శ్రావ్య కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈమె కన్నడలో ‘రోజ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత ఈమె తెలుగులో ‘కాయ్ రాజా కాయ్’, ‘నందిని నర్సింగ్ హోమ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వీటిలో ‘నందిని నర్సింగ్’ హోమ్ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. కమర్షియల్ గా కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. తెలుగులో ఈమెకి అనుకున్న స్థాయి గుర్తింపు రాకపోయినా, తమిళం లో మాత్రం మంచి గుర్తింపు లభించింది.

    అక్కడ ఈమె మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తే ఒక సినిమా సూపర్ హిట్ గా నిల్చింది. 2017 వ సంవత్సరం లో ఈమె ‘విలయత్తు ఆరంభం’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ద్వారా ఇప్పటికీ యాక్టీవ్ గానే ఉంటుంది. తనకి సంబంధించిన ఫోటోలను, రీల్స్ ని ఈమె అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అభిమానులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఈ సీజన్ బిగ్ బాస్ లోకి ఒక కంటెస్టెంట్ గా ఈమెకు అడుగుపెట్టే ఆఫర్ ఇచ్చారట. కానీ ఆమె తనకి ఆసక్తి లేదని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఈమె ట్రెడిషనల్ లుక్ లో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేయగా, అవి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.