Sagar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సీరియల్ నుంచి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నవారు కూడా ఉన్నారు.నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు సైతం మొదటి ‘శాంతి నివాసం’ అనే సీరియల్ చేసి దర్శకుడిగా అక్కడ సక్సెస్ అయ్యాక ఇక్కడ తన ప్రతిభను చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ‘మొగలిరేకులు ‘ సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సాగర్… ఈ సీరియల్ తో ఆయనకు ఒక స్టార్ హీరోకి వచ్చినంత ఇమేజ్ అయితే వచ్చింది. ఇక ఈ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది దర్శకులు సైతం అతనితో సినిమాలు చేయడానికి సన్నాహాలైతే చేశారు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్ ‘ సినిమా లో ఒక మంచి క్యారెక్టర్ ఉండడంతో ఆ సినిమా దర్శకుడు అయిన దశరథ్ సాగర్ ని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక అప్పుడు సాగర్ ఆ క్యారెక్టర్ నేను చేయను అని చెప్పారట. దాంతో ఆ క్యారెక్టర్ కోసం వేరే నటుడిని చూస్తున్న క్రమంలో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బాబీ సాగర్ దగ్గరికి వచ్చి ఆ క్యారెక్టర్ రాజు సుందరం గారి కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్…
ఆ పాత్ర నువ్వు చేస్తే దానికి మంచి గుర్తింపు రావడమే కాకుండా నీకు కూడా మంచి పేరు వస్తుంది అంటూ కొన్ని మాటలు చెప్పాడట…ఇక మొత్తానికైతే అతన్ని ఒప్పించాడట. ఇక ఈ సినిమా షూటింగ్ బాగానే జరిగినప్పటికి ఫైనల్ గా సినిమాలో మాత్రం అతని క్యారెక్టర్ చాలా తక్కువగా ఉందట…అసలు అతన్ని ఎవ్వరు గుర్తించకపోవడం కూడా అతనికి భారీగా మైనస్ అయిందనే చెప్పాలి.
అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ బాబీ వల్లే నేను ‘మిస్టర్ ఫర్ పెక్ట్ ‘ సినిమాలో నటించాల్సి వచ్చింది. దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా చాలావరకు నా ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పాడు.
ఇక మొత్తానికైతే వీళ్ళ వల్ల సాగర్ కెరియర్ అటు ఇటు కాకుండా పోయిందనే చెప్పాలి. అటు సీరియల్ చేసుకోలేక, ఇటు సినిమాలు చేసుకోలేక పోయాడట…ఇక ప్రస్తుతానికైతే ఆయన ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది…