https://oktelugu.com/

Venky Atluri : వెంకీ అట్లూరి కి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు వీళ్లేనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2025 / 12:39 PM IST

    Venky Atluri

    Follow us on

    Venky Atluri : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఇప్పటివరకు యంగ్ డైరెక్టర్లు కొత్త కథలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న క్రమంలో వెంకీ అటూరి లాంటి దర్శకుడు సైతం వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు… అందుకే ఆయన వరుసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరెక్టర్ మంచి కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో వెంకీ అట్లూరి పరభాష హీరోలతో సినిమాలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే మన హీరోల నుంచి అతనికి సరైన సహకారం అయితే అందడం లేదట. ఇప్పటివరకు ఆయన కొంతమంది హీరోలకు కథలు చెప్పినప్పటికి వాళ్లు సినిమా కథలో వేలు పెట్టడం, కథను మార్చమని చెప్పడంతో ఆయన పరభాష హీరోలను ఆశ్రయించినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి మొత్తానికైతే వెంకీ అటూరికి హ్యాండ్ ఇచ్చిన హీరోలలో నితిన్, నాని, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు ఉండడం విశేషం… ఈ నలుగురు హీరోలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.

    ఇక ఇప్పటివరకు వీళ్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా వీళ్ళు మంచి ఇమేజ్ ను సంపాదించుకుంటే స్టార్ హీరోల రేంజ్ కు వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వెంకీ అట్లూరి రాసుకున్న కథలను జడ్జ్ చేయడం లో ఈ హీరోలు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

    అందువల్లే ఒక దర్శకుడు విజయంకి వాల్యూ ఇచ్చి ఆయన ఎలాగైతే సినిమాలు చేయాలి అనుకుంటున్నాడో అలా సినిమాను చేయించుకునే హీరోలు దొరకడం కూడా చాలా అదృష్టమనే చెప్పాలి. మరి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి హీరో తనకు అనుకూలంగా కథను మార్చమని సలహాలు ఇచ్చే వారే తప్ప కథ ఏం కోరుకుంటుంది. దానికి మనమేం ఇవ్వాలి అనే ధోరణిలో ఆలోచించే హీరోల సంఖ్య చాలా తగ్గిపోయిందనే చెప్పాలి…

    మరి మొత్తానికైతే ఈ స్టార్ హీరోలు వెంకీ కి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆయన ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక మరోసారి కూడా వాళ్లతోనే సినిమాలు చేయాలనే ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…