Mahesh Babu Okkadu Sister: చిన్నతనం నుంచి ఆర్టిస్టులుగా చేసిన వారు హీరో, హీరోయిన్లుగా చేశారు. ప్రేక్షకులను మెప్పించారు. శ్రేదేవి, మీనా, రాశి బాల నటులుగా ప్రవేశించి హీరోయిన్లుగా సత్తా చాటారు. హీరోల విషయానికి వస్తే హరీష్, బాలాదిత్య, కల్యాణ్ రామ్ లాంటి వారు కూడా చిన్నతనంలో సినిమాలు చేసి ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్నారు. ప్రతిభ ఉంటే పరిశ్రమలో అవకాశాలకు కొదవ లేదు. కానీ కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసినా తరువాత నటనకు గుడ్ బై చెప్పి వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే కోవలో నటి నిహారిక కూడా చేరుతుంది. ఇంతకీ నిహారిక అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కడు సినిమాలో మహేశ్ బాబు తో ఆమె చేసిన అల్లరి అందరికి గుర్తుండే ఉంటుంది.

వెంకటేశ్ తో ప్రేమించుకుందా రా, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాల్లో నటించి మెప్పించింది. తరువాత అవకాశాలు వచ్చినా చదువుకే ప్రాధాన్యం ఇచ్చి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లయింది. వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే తరువాత సినిమా అవకావాలు వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఒప్పుకోవడం లేదు. దీంతో ఆమె భర్త, పిల్లలు సంసారానికి పరిమితమైంది.
Also Read: Pawan Kalyan Nani: నానిని పొగిడి.. జగన్ ను పరోక్షంగా తిట్టి.. ‘అంటే పవన్ కళ్యాణ్’ అన్నట్టు!
నటనకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. కానీ చదువుపై ఉన్న మక్కువతోనే నటనకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. తరువాత ఓ రాజకీయ కుటుంబంతో ఆమెకు వైవాహిక జీవితం ప్రారంభం అయింది. ఆమె పెళ్లికి ముఖ్యమంత్రులు సైతం వచ్చారు. దీంతో ఆమె కుటుంబానికి సేవలు చేసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నటన వైపు చూడలేదు. కానీ పెళ్లయ్యాక కూడా క్యారెక్టర్ ఆర్టిస్లులుగా ఎంత మంది వస్తున్నా ఆమె నటనకు మాత్రం పూర్తిగా దూరమైనట్లు తెలిసిందే.

భవిష్యత్ లో కూడా ఆమె నటించేందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. పూర్తిగా పిల్లలు, భర్త సంసారంకే ఓటు వేస్తున్నారు. నిహారిక మళ్లీ సినిమాల వైపు చూసే పరిస్థితి లేదు. కానీ చైల్డ్ ఆర్టిస్టుగానే ఆమె తన ప్రతిభ చూపించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సినిమాల ప్రభావానికి దగ్గరయ్యే పరిస్థితులు లేవు. దీంతో సినిమాలు చేయడానికి ఆమె ఇష్టం చూపించడం లేదు. అందుకే తన సంసారంలో పిల్లల పెంపకంలోనే కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Ante Sundaraniki Review: అంటే సుందరానికీ మూవీ రివ్యూ