https://oktelugu.com/

Net Speed: దేశంలో ఈ నగరంలోనే స్పీడ్ నెట్‌వర్క్.. ఎంత ఎంబీపీఎస్ అంటే?

మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో నెట్‌వర్క్ స్పీడ్ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇండియాలో ఓ నగరంలో మాత్రం ఎక్కువ నెట్ స్పీడ్ ఉంటుందట. ఇంతకీ ఆ నగరం ఏది? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2024 / 02:37 AM IST

    Internet speed

    Follow us on

    Net Speed: ప్రస్తుతం ప్రపంచమంతా ఇంటర్‌నెట్ హవా నడుస్తోంది. ఒక పూట ఫుడ్ లేకపోతే ఉండగలరు ఏమో.. కానీ ఒక్క సెకను ఇంటర్‌నెట్ లేకపోతే ఉండలేరు. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఇంటర్‌నెట్‌తోనే రోజంతా సమయం గడుపుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఎక్కువగా ఇంటర్‌నెట్‌‌ను వినియోగిస్తున్నారు. అప్పుడు ఇంటర్‌నెట్ స్పీడ్ అంత ఎక్కువగా ఉండేది కాదు. అలాగే వాడకం కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు దీని వాడకం విపరీతం పెరిగిపోయింది. అప్పుడు కొంత మంది దగ్గర మాత్రమే స్మార్ట్‌ఫోన్ ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి దగ్గర చూసిన కూడా స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఇలా ఒకటి కాదు రెండు కూడా కొందరు వాడుతున్నారు. ఎప్పుడో నెట్ కూడా తక్కువ స్పీడ్ వస్తే చిరాకు పడతారు. గతంలో 2జీ, 3జీ వినియోగించేవారు. కానీ ఇప్పుడు 4జీ, 5జీ కూడా వాడుతున్నారు. ఈ స్పీడ్ వాడుతుండటంతో ఒకవేళ నెట్ స్పీడ్ తగ్గిన కూడా తట్టుకోలేరు. పట్టణాల్లో అయితే నెట్ స్పీడ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ గ్రామాల్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో నెట్‌వర్క్ స్పీడ్ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇండియాలో ఓ నగరంలో మాత్రం ఎక్కువ నెట్ స్పీడ్ ఉంటుందట. ఇంతకీ ఆ నగరం ఏది? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా నెట్‌వర్క్ స్పీడ్ పెరుగుతోంది. మెట్రో నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం స్పీడ్ బాగానే పెరిగింది. అయితే దేశంలో చెన్నై నగరంలో అన్ని నగరాల కంటే ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉందని ఇటీవల ఊక్లా అనే నివేదిక తెలిపింది. ఇంటర్నెట్ వేగం సగటున 51.07Mbpsగా ఉంది. మిగతా నగరాలతో పోలిస్తే ఈ నగరంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగానే ఉంది. దీని తర్వాత బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ 42.50Mbpsగా ఉంది. మూడో స్థానంలో తెలుగు నగరమైన హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ సగటు వేగం 41.68Mbps ఉంది. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ ఇంటర్నెట్ వేగంలో ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ నెట్‌వర్క్ స్పీడ్ 32.39Mbpsగా ఉంది. అయితే ఇంటర్నెట్‌ స్పీడ్‌లో భారత్ 49వ ర్యాంకు సాధించింది. నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్‌ ఈ ఏడాదికి గాను విడుదల చేసిన ర్యాంకులో భారత్ 49వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను విరివిగా వాడుతున్నారు. మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే కాకుండా వైఫే కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల ఇంకా ఈ ఇంటర్నెట్‌కి బాగా అలవాటు పడ్డారు. ఒక్క గంట సేపు మొబైల్ లేకుండా అసలు ఉండలేరు. నెట్ లేకపోతే అసలు కొందరకి మైండ్ కూడా పనిచేయదు. నెట్‌వర్క్ వల్ల అందరూ అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. కొందరు దీనివల్ల పాడైన వారు ఉంటే మరికొందరు మంచి స్థానంలో ఉన్నవారు కూడా ఉన్నారు.