https://oktelugu.com/

Vijaya Bhaskar: విజయ్ భాస్కర్ ప్రేమ కథ సినిమాలు చేయడానికి…తన కూతురు పెళ్లి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

ఇక సినిమాల విషయం లో డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ చాలా జాగ్రత్త గా వ్యవహరిస్తూ ఉంటారు...ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ సినిమా దర్శకుడికి చాలా మంచి పేరు వస్తుంది...తద్వారా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం కూడా వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 11:29 AM IST

    Vijaya Bhaskar

    Follow us on

    Vijaya Bhaskar: ఒకప్పుడు స్టార్ హీరోలందరితో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ భాస్కర్..ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక ఈయన మాత్రం అప్పట్లో వెంకటేష్ ,నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అడపాదడప సినిమాలు చేస్తూ తన కెరీర్ ని ముందుకు లాగిస్తున్నప్పటికీ ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చిత్రాలుగా మిగిలిపోయాయి. ఇక అందులో భాగంగానే ఆయన సినిమాల్లో లవ్ స్టోరీలు ఎక్కువగా ఉండేవి. ఇక తాను ఆ సబ్జెక్టులను చాలా నీట్ గా డీల్ చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఈయనకు త్రివిక్రమ్ కథ మాటలు అందిస్తూ ఉండేవాడు దానివల్ల ఇద్దరు మంచి విజయాలను సాధించారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే విజయ భాస్కర్ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ భాస్కర్ తన కూతురు ఒకతన్ని లవ్ చేస్తుందని అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆయన కోపానికి రాకుండా ఆ అబ్బాయి ఎవరో ఒకసారి తీసుకొచ్చి మాట్లాడించమని చెప్పారట.

    దాంతో అబ్బాయి వచ్చి మాట్లాడితే అతని బిహేవియర్ విజయభాస్కర్ కి బాగా నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఆ తరువాత అంత సెట్ చేసి తన కూతురికి పెళ్లి చేశారట. ఇక ఈ విషయం మీద ఆయన స్పందిస్తూ నేను ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలు చేయడం వల్ల ప్రేమ అనేదాని మీద నాకు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. అందువల్లే నా కూతురు ప్రేమించిందని చెప్పినా కూడా నేను ఏమాత్రం కోపానికి రాకుండా వాళ్లకు పెళ్లి చేశాను.

    బహుశా ఎక్కువ లవ్ స్టోరీ సినిమాలు చేయడం వల్లే నేను ఇలా మారిపోయానేమో అందుకే లవ్ స్టోరీ లు ఎక్కువ గా చేయకూడదు అంటూ ఆయన చాలా ఫన్నీ గా సమాధానం చెబుతూ నవ్వుకున్నారు. ఇక రీసెంట్ గా తన కొడుకుని హీరోగా పెట్టి ‘ ఉషా పరిణయం’ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లభించినప్పటికీ విజయ భాస్కర్ దర్శకత్వం మాత్రం చాలా బాగుంది అంటూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు అడపదడప సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

    ఇక రీసెంట్ గా విజయభాస్కర్, త్రివిక్రమ్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనే విషయాన్ని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలియజేశాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. అందుకే వీళ్ళ కాంబోలో సినిమాలు రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. ఇక విజయ్ భాస్కర్ దానికి పులిస్టాప్ పెడుతూ రీసెంట్ గా త్రివిక్రమ్ ను కలిసిన విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాడు…