Art Films: మలయాళం సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి(Mammootty) పైవిద్యమైన పాత్రలను చేస్తున్నాడు. ఆయననే కాకుండా మోహన్ లాల్(Mohan Lal) కూడా తనదైన రీతిలో తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మన హీరోలు అలాంటి పాత్రని చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక రీసెంట్ గా మమ్ముట్టి చేసిన బ్రమయుగ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. 70 సంవత్సరాల వయసులో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే తపన సినిమాలో కనిపించిందంటూ విమర్శకులు సైతం ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఇలాంటి ఒక డిఫరెంట్ పాత్రలో మన హీరోలు ట్రై చేస్తే బాగుంటుందని సినీ విమర్శకులు సైతం మన హీరోలను విమర్శిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు హీరోలు మాత్రం అలాంటి పాత్రలు ఎందుకు చేయడం లేదు అంటే వాటిని చేసిన కూడా మన ప్రేక్షకులు ఆదరించట్లేదు. అనే ఒకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మన హీరోలు అలాంటి సినిమాలను చేయకుండా రిజెక్ట్ చేస్తున్నారు. అంతే తప్ప మన వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేక కాదు అని కొంతమంది కొన్ని రకాల కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి మన హీరోలు అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేసిన కూడా మన ప్రేక్షకులు వాటిని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎందుకంటే కమర్షియల్ సినిమాలు చేసి ఒక ఆర్ట్ సినిమా చేయడం వల్ల దానిని ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. అలా కాకుండా వరుసగా ఒకటి రెండు ఆర్ట్ ఫిలిం లు చేసినట్లయితే ప్రేక్షకులు కూడా మన హీరోల క్యారెక్టర్ కి గాని, వాళ్ళు చూపించిన నటనకి గాని ఫిదా ఆయిపోయి ఆ పాత్రను రిసీవ్ చేసుకుంటారు.
అలా కాకుండా అడపాదడప అర్ట్ సినిమాలు చేస్తూ దానిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవట్లేదు అనే విషయాన్ని సాకుగా చెప్పి మన హీరోలు కూడా అలాంటి పాత్రల్లో నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక హీరోలు మారితే ప్రేక్షకులు మారుతారు అనే ఒక చిన్న లాజిక్ ని గుర్తు పెట్టుకొని మన హీరోలు సినిమాలు చేస్తే బాగుంటుందని సినీ విమర్శకులు సైతం ప్రతిసారి విమర్శిస్తూనే ఉంటున్నారు…