Aparichitudu: అపరిచితుడు సినిమా చూశారా? ఈ సినిమాను మర్చిపోవడం అంత పాజిబుల్ కూడా కాదు ఏమో.. ఒక మనిషి ఎన్నో రకాలుగా కనిపిస్తూ..దాన్ని ఒక కొత్త రోగంగా చూపించారు దర్శకుడు శంకర్. ఇందులో విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాత్రలో ఆయన తప్ప మరొక హీరోను ఊహించుకోలేరు ప్రేక్షకులు. ఈ ఒక్క పాత్రలో ముగ్గురు మనుషులు ఉంటారు. అందులో ఒకతను మాత్రం అన్యాయాన్ని సహించడు. నేరస్తులు అందరినీ చంపుతుంటాడు.
పోలీసులు మాత్రం హత్యలు చేసేది ఎవరు అని తెలుసుకునే పనిలో పడుతారు. కానీ ఒక్క ఆధారం కూడా లభించదు. ఇందులో ఒక పాత్ర హీరోయిన్ ను ప్రేమిస్తుంటుంది. కానీ విక్రమ్ వింత ప్రవర్తనను చూసి ఈయనను సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ విక్రమ్ ను హిప్నటైజ్ చేస్తారు. ఈ సందర్భంలోనే తనకు ఒక చెల్లి ఉండేదని.. ఆమె చనిపోయిందని సమస్యను తెలుపుతాడు. అప్పటి నుంచి విక్రమ్ మానసికంగా బలహీన పడతాడు అని తెలుస్తోంది. అప్పటి నుంచే మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ వస్తుంది.
సైకియాట్రిస్ట్ సహాయంతో హీరో మామూలు మనిషి అవుతాడు. కానీ చివరకు ట్రైన్ లో మరో వ్యక్తిని చంపేస్తాడు. అయితే తెలిసిన స్టోరీని మళ్లీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు. చూశాం కదా మళ్లీ చదవడం దేనికి అనుకుంటున్నారా? అయితే ఈ సినిమా చివరలో విక్రమ్ ఎందుకు ఆ వ్యక్తిని చంపాడో తెలుసా? మీలో చాలా మందికి సరైన సమాధానం తెలియదు అనుకుంటా.. ఓసారి ఇది చదవండి. నాకు తెలిసి మీరందరూ పబ్లిక్ ప్లేస్ లో తాగాడు. అలా తాగడం తప్పు కాబట్టి చంపాడు అనుకుంటున్నారు కదా..
మీ ఆన్సర్ ఇదే అయితే మీరు పొరబడినట్టే. తన చెల్లి చనిపోవడానికి కారణం అయిన లైన్ మ్యాన్ అతనే. అందుకే ఆ వ్యక్తిని చంపేస్తాడు విక్రమ్. మరి ఈ విషయం గురించి క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సినిమా చూడండి. మొత్తం మీద సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు.