Prabhas Adipurush: ఇటీవల అనారోగ్యంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాదులోని ఇంటికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులే కాక, వివిధ ప్రాంతాల నుంచి కృష్ణంరాజును కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రంతా వారు అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగేంతవరకు కూడా అక్కడే ఉన్నారు. అందులో కృష్ణంరాజు అభిమానులు ఉన్నప్పటికీ.. అందులో మెజారిటీ శాతం ప్రభాస్ అభిమానులే. ఈ చిన్ని ఉదాహరణ చాలు ప్రభాస్ అంటే వారికి ఎంత ప్రాణమో చెప్పడానికి. అంత దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం, అంత బాధలో ఉండి కూడా ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయించారు. అభిమానులు అంటే ప్రభాస్ కు ఎంత ఇష్టమో ఈ ఒక్క సంఘటన చాలు. బాహుబలి తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు. సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ పై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ఉన్నాయి. ప్రాజెక్టు కే సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. సలార్ కూడా అదే స్థాయిలో ఉంది. స్పిరిట్ షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది. మారుతి సినిమా హీరోయిన్ పోర్షన్ షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు 1500 కోట్ల బడ్జెట్ అవుతోందని ట్రేడ్ వర్గాల బోగట్టా. ఆదిపురుష్ ఫస్ట్ లుక్, టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బాలీవుడ్లో హేమాహేమీ లాంటి నటులు ఉన్నా ఓం ప్రకాష్ రౌత్ తాను తీస్తున్న ఆదిపురుష్ లో ప్రభాస్ ను తీసుకోవడానికి కారణాలు ఏంటా అని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగా అనిపించింది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాస్ కు మొదటినుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. నటనపై ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. తొలి సినిమా ఈశ్వర్ తో తాను ఏంటో నిరూపించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే యంగ్ రెబల్ స్టార్ గా ప్రేక్షకులతో పిలిపించుకున్నాడు. అంతేగాక ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలతో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో మరే ఇతర సినిమాలు ఒప్పుకోలేదు.
Also Read:
అనుష్క, రానా ఇతర సినిమాలు చేసినా.. ప్రభాస్ మాత్రం కేవలం బాహుబలి కే అంకితమయ్యాడు. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. పైగా ఎంప్టీ చెక్కు ఇచ్చినా నిర్మాతలను సున్నితంగా తిరస్కరించాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఒదిగి ఉంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా అభిమానుల పట్ల అతడు చూపించే ప్రేమ వెలకట్టలేనిది.

తనకోసం వచ్చే అభిమానులతో ఆయన చాలా ఓపికగా మాట్లాడుతాడు. తాను పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఏమాత్రం హిపోక్రసీ చూపించడు. ఆ మధ్య జాతి రత్నాలు సినిమా కోసం ప్రమోషన్ లో పాల్గొన్నాడు. పూరి ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాకి కూడా తన వంతు ప్రమోషన్ చేశాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సీతారామమ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై ఆ సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రభాస్ కు తన అభిమానులంటే చాలా ఇష్టం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే కరిగిపోతాడు. తన వంతు సహాయం చేస్తాడు. తన ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఇటీవల రేంజ్ రోవర్ కారు ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవే. వెలుగులోకి రానివి ఇంతకీ మూడింతలు ఉంటాయి. ఏమాత్రం ప్రచారం కోరుకొని ప్రభాస్.. లో ప్రొఫైల్ ను ఇష్టపడతాడు. అందుకే ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న ఏకైక నటుడు ప్రభాస్ మాత్రమే. ఇవి కనుక భారీ విజయాలను నమోదు చేస్తే.. ప్రభాస్ కు గాలి పీల్చుకునేందుకు కూడా తీరిక ఉండదు.