https://oktelugu.com/

Abortions- Supreme Court: పెళ్లి కాని వారు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Abortions- Supreme Court: పెళ్లి అయితే అబార్షన్ చేయడానికి ఆస్పత్రులున్నాయి. కానీ పెళ్లి కాని వారికి చేయడానికి నానా ఆంక్షలు.. రహస్యంగా కానిచ్చేయాలి. ఇందుకోసం లక్షలు వసూలు చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా కడుపు తీయించేస్తారు. బాయ్ ఫ్రెండ్ తోనే.. ప్రేమ వ్యవహారంలోనో లేక వివాహేతర సంబంధాల వల్లనో గర్భం దాల్చే మహిళలకు ఇన్నాళ్లు అబార్షన్లు అంటే అదొక పెద్ద టాస్క్. సమాజంలో పరువు పోయే పనిచేస్తున్నారని ఈసడింపులు.. ఆస్పత్రుల్లో చేయడానికి అభ్యంతరాలు. కానీ వీటన్నింటిని పటాపంచలుచేస్తూ సుప్రీంకోర్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2022 / 12:53 PM IST
    Follow us on

    Abortions- Supreme Court: పెళ్లి అయితే అబార్షన్ చేయడానికి ఆస్పత్రులున్నాయి. కానీ పెళ్లి కాని వారికి చేయడానికి నానా ఆంక్షలు.. రహస్యంగా కానిచ్చేయాలి. ఇందుకోసం లక్షలు వసూలు చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా కడుపు తీయించేస్తారు. బాయ్ ఫ్రెండ్ తోనే.. ప్రేమ వ్యవహారంలోనో లేక వివాహేతర సంబంధాల వల్లనో గర్భం దాల్చే మహిళలకు ఇన్నాళ్లు అబార్షన్లు అంటే అదొక పెద్ద టాస్క్. సమాజంలో పరువు పోయే పనిచేస్తున్నారని ఈసడింపులు.. ఆస్పత్రుల్లో చేయడానికి అభ్యంతరాలు. కానీ వీటన్నింటిని పటాపంచలుచేస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పెళ్లి అయిన వారికి.. పెళ్లి కాని వారికి మహిళలు ఎవరికైనా అబార్షన్ వారి హక్కు అని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇంకా పాత చట్టాలు, నిబంధనలు పట్టుకొని ఉండకూడదని.. సమాజం మారాలంటూ

    Abortions- Supreme Court

    మహిళలందరూ సురక్షితమైన.. చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులు.. ఈ విషయంలో వివాహిత మరియు అవివాహిత మహిళ మధ్య తేడా చూపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా మరియు జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. అయితే వైవాహిక అత్యాచారం (బలవంతంగా భర్త శృంగారం చేయడం) పూర్తిగా అబార్షన్ పరిధిలో ఉందని వ్యాఖ్యానించింది.

    ఒక మహిళకు పెళ్లి అయ్యిందా? కాలేదా? అన్నది అబార్షన్ హక్కును హరించడానికి ఒక కారణం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లికాని యువతులు కూడా కూడా 24 వారాలలో అవాంఛిత గర్భాన్ని రద్దు చేసుకునేందుకు అర్హులు అని కోర్టు పేర్కొంది. అవివాహిత మహిళలకు అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కును తొలగించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది.

    అబార్షన్ చట్టాల ప్రకారం.. వివాహిత మరియు అవివాహిత స్త్రీల మధ్య వ్యత్యాసం చూపరాదని పేర్కొంది. వివాహిత స్త్రీలు మాత్రమే లైంగికంగా చురుగ్గా ఉంటారనే మూస పద్ధతిని విడనాడలాని పేర్కొంది.

    Supreme Court

    25 ఏళ్ల అవివాహిత మహిళ వేసిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువడింది. తాను అవివాహితురాలిని అని.. గర్భం దాల్చినందున ఈ చట్టం ప్రకారం అబార్షన్‌కు అర్హులు కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మహిళ అప్పీల్ చేసింది. తాను గర్భం దాల్చి 23 వారాలయ్యిందని ఆ మహిళ సమర్పించింది. తన భాగస్వామి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఆమె సుప్రీంకోర్టుకు తెలిపింది. ఐదుగురు తోబుట్టువుల్లో తాను పెద్దదానినని, తన తల్లిదండ్రులు రైతులని, బిడ్డను పెంచే స్తోమత తనకు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జులై 21న, పిండం ఆమెకు హాని కలిగించదని వైద్య బోర్డు నిర్ధారించడంతో కోర్టు ఆ మహిళకు గర్భస్రావం చేసేందుకు అనుమతించింది. అబార్షన్ హక్కుకు సంబంధించి పెళ్లికాకున్నా చేసుకోవచ్చని కోర్టు కేంద్రానికి నోటీసు కూడా జారీ చేసింది.

    ఈ తీర్పుతో దేశంలో పెళ్లికాకుండా గర్భందాల్చే మహిళలకు గొప్ప ఊరటగా చెప్పొచ్చు.ఇన్నాళ్లు అవమానాల పాలైన మహిళా లోకానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రక నిర్ణయంగా మారుతుందనడంలో సందేహం లేదు. వారి హక్కులకు గౌరవం కల్పించదని చెప్పొచ్చు.

    Tags