Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉంటాయి. వెనకబడిన వర్గాలను ఆదరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన చాలా వరకు సేవ కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ ఉంటాడు. సినిమాలు చేస్తున్నది తను బతకడానికి అయితే సేవ చేస్తుంది మాత్రం పేదలను బ్రతికించడానికి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఆయన చాలా మంది కి సహాయాలు చేస్తూ కష్టాల్లో ఉన్నవారిని ఆదరిస్తూ వస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కి గద్దర్, వంగపండు లాంటి విప్లవ భావాలు ఉన్న రచయితలు రాసే పాటలు అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ల పాటల్ని ఎక్కువగా పాడుతూ ఉంటాడు. ఇక ఇవే కాకుండా కొంత మంది రచయితలు రాసిన పల్లె పాటలు, జానపద పాటలు గాని, ప్రాంతీయ పాటలు అన్న కూడా ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా వాడడానికి ఇష్టపడుతుంటారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువగా ఒక పాట అనేది ఎప్పుడూ పాడుతూ ఉంటారు. అది ఏంటి అంటే నబో నబో రబ్బరి గాజులు ఎత్తు గొలుసులు ముక్కుపుడకలు నడుము సన్న నాగరాజు… ఈ పాటని గుడుంబా శంకర్, తమ్ముడు లాంటి సినిమాల్లో వాడుతూ వచ్చారు.అలాగే ఖుషి సినిమాలో కూడా బై బై యే బంగారు రవణమ్మ అనే సాంగ్ కూడా పాడారు. ఇలా తనకి ప్రాంతీయ పాటలన్న, విప్లవ గీతాలు అన్న తనకి చాలా ఇష్టం. ఎవరో చెప్పిన ఈ రెండు జానపద పాటల్ని తన సినిమాల్లో వాడుకుంటూ ఇప్పటికీ తను హ్యాపీగా ఉన్న సిచువేషన్ లో వాటిని పాడుకుంటూ హమ్ చేస్తూ ఉంటాడని తనతో సన్నిహితంగా ఉండే చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నప్పటికీ ఆయనకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం.
అలాగే ఊర్లల్లో ఉండే ప్రజలతో కలిసి బతకడం అంటే చాలా ఇష్టం. తను కోటలో ఉన్నప్పటికీ సామాన్య జనాల్ని ఎక్కువగా ఇష్టపడతాడు అందుకే ఆయనకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. వ్యక్తిత్వం పరంగానే ఆయనకి అభిమానులు అయినవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక సినిమాల పరంగా ఆయనకి స్టార్ డమ్ వస్తే ఆయన మనస్తత్వం తో చాలా మంది లో ఆయన మావాడే అనే భావనని నింపాడు. అందుకే ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్న పవన్ కళ్యాణ్ సపరేట్ ఇమేజ్ తో ఉంటాడు.